రాష్ట్రీయం

వ్యవసాయ ఉత్పత్తుల ధరలను స్థిరీకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని/గొనెగండ్ల, నవంబర్ 29: వైసీపీ అధికారంలోకి రాగానే రైతులు పండించిన ఉత్పత్తుల ధరలు స్థిరీకరిస్తామని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. ప్రజా సంకల్పయాత్ర 21వ రోజు బుధవారం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా కైరుప్పలలో పత్తి రైతులు హుసేనమ్మ, రమీజాబీ తదితరులు కలిసి పత్తికి గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయామని మొరపెట్టుకున్నారు. పత్తి పండించేందుకు ఎకరాకు రూ.30 వేలు ఖర్చు చేశామని, అయితే రూ.20 వేలు మాత్రమే చేతికొచ్చిందని అన్నారు. దీనిపై స్పందించిన జగన్ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. వైకాపా అధికారంలోకి రాగానే రైతులకు గిట్టుబాటు అయ్యేలా ధరలను ప్రకటిస్తామన్నారు. ఉపాధి పనులు సక్రమంగా జరడంలేదని దీంతో వలసలు పెరిగాయన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా పరిష్కరించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు తమ గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. తమను ఎస్టీలో చేర్చాలని రజకులు జగన్‌ను కోరారు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని పలువురు జగన్‌కు విన్నవించారు. పలువురు ఉపాధ్యాయులు జగన్‌ను కలిసి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.
సంకల్పయాత్ర 21వ రోజు బుధవారం గోనెగండ్ల మండలంలో కొనసాగింది. గంజహళ్ళి, కైరుప్పల, ఆగ్రహారం, ఐకొండ, కారుమంచి మీదుగా ఆస్పరి మండలంలోకి ప్రవేశించింది.

చిత్రం..మహిళా రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తున్న జగన్