రాష్ట్రీయం

విద్యుత్ ఉద్యోగుల వివాదానికి సమన్వయంతో పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: విద్యుత్ ఉద్యోగుల వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోని పక్షంలో, ఆ తర్వాత తాము చెప్పేది వినాల్సి వస్తుందని ఉమ్మడి హైకోర్టు ఉభయ తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. 1200 మంది విద్యుత్ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. రిలీవ్ అయిన 1200 మంది ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని రెండు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశించింది. ఏపి తరఫున న్యాయవాది కృష్ణప్రకాశ్ వాదనలు వినిపిస్తూ, 1200 మంది విద్యుత్ ఉద్యోగుల్లో 596 మంది ఉద్యోగులు ఏపిని , 501 మంది ఉద్యోగులు తెలంగాణను కోరుకున్నారని, మిగిలిన 22 మంది ఆప్షన్లు ఇవ్వలేదని తెలిపారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు వారాలు గడువు ఇవ్వాలని ఆయన కోరగా అందుకు హైకోర్టు సమ్మతించింది. ఈ లోగా వివాదాన్ని పరిష్కరించుకోని పక్షంలో వాదనలకు సిద్ధం కావాలని హైకోర్టు స్పష్టం చేసింది.