రాష్ట్రీయం

ఇనుమడించిన హైదరాబాద్ ప్రతిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: ప్రపంచ పారిశ్రామిక సదస్సుతో పాటు మెట్రోరైలు ప్రారంభోత్సవం, ఇతర కార్యక్రమాలు దిగ్విజయం కావడంతో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరిగిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సంతోషం, సంతృప్తిని వ్యక్తం చేసారు. అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక పర్యటన అధ్యంతం రహ్యంగా కొనసాగినప్పటికీ ఆమె భద్రతకు సంబంధించిన వ్యూహాలకు అనుగుణంగా తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యల పట్ల అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు సైతం తెలంగాణ పోలీసులు, డిజిపిని అభినందించారని ముఖ్యమంత్రి గుర్తు చేసారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ సందేశం పంపించిందని ముఖ్యమంత్రి అన్నారు. దేశ, విదేశాల నుంచివచ్చిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తల మర్యాద, గౌరవానికి ఏమాత్రం భంగం కలుగకుండా, ఎలాంటి ఇబ్బందికి ఆస్కారం లేకుండా భద్రతా ఏర్పాట్లు చేసారని పోలీసు శాఖను ముఖ్యమంత్రి అభినందించారు. అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత హుందాగా పోలీసుశాఖ పని చేసిందన్నారు. పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి తనకు సందేశం వచ్చిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని భార్య చెర్రీ బెయిర్‌తో సహా 150కి పైగా దేశాల నుంచి వచ్చిన అనేక మంది ప్రముఖులకు అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసారని ప్రశంసించారు. మెట్రోరైలు ప్రారంభం, గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభోత్సవ వేదికలతో పాటు ఒకే రోజు ఎనిమిది చోట్ల అత్యంత ప్రాధాన్యమైన కార్యక్రమాలు, వివిఐపీల పర్యటనలు ఉన్నప్పటికీ పూర్తి సమన్వయంతో, టీమ్ స్పీరిట్‌తో సవాల్‌గా తీసుకొని సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు. పోలీసులు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేసారని ముఖ్యమంత్రి కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అతిపెద్ద కార్యక్రమం దిగ్విజయం కావడంలో పోలీసు యంత్రాంగం కీలక పాత్ర పోషించారన్నారు. ఒకే రోజు మియాపూర్ మెట్రోరైలు స్టేషన్, మాదాపూర్ హెచ్‌ఐసిసి, ఫలక్‌నుమా, గోల్కొండ కోట, బేగంపేట విమానాశ్రయం, శంషాబాద్ విమానాశ్రయం, ట్రిడెంట్ హోటల్, విఐపీల విమానాల రాకపోకలు, మూడు సైనిక హెలక్యాప్టర్ల సంచారం ఇవన్నీ హైదరాబాద్ చరిత్రలో మనుపెన్నడూ జరుగలేదని ముఖ్యమంత్రి గుర్తుచేసారు. అమెరికా సీక్రెట్ ఏజెన్సీ, కేంద్ర హోంశాఖలతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సమన్వయం చేసుకోవడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. డిజిపిగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే జరిగిన పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసారని ముఖ్యమంత్రి కొనియాడారు.
ఇవాంకా పర్యటన ఆద్యంతం గోప్యమే...
ఇవాంకా ట్రంప్ పర్యటన అధ్యంతం గోప్యంగానే జరిగిందన్నారు. అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆమె కదలికలపై చివరిక్షణంలోనే రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. ఇవాంకా ముందుగా ప్రత్యేక విమానంలో వస్తారని చెప్పారని, అయితే చివరికి సాధారణ ప్యాసింజర్ విమానంలోనే వచ్చారన్నారు. వెస్టిన్ హోటల్లో బస చేస్తారని ముందు సమాచారం ఇచ్చినప్పటికీ చివరకు ట్రిడెంట్‌లో బస చేసారన్నారు. గోల్కొండ కోటను సందర్శించే విషయాన్ని కూడా చివరి క్షణం వరకు గోప్యంగా ఉంచారన్నారు. అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ భద్రతా వ్యూహాలకు అనుగుణంగా తెలంగాణ పోలీసులు కూడా ప్లాన్ ఎ, ప్లాన్ బిలను రూపొందించుకున్నారని అన్నారు. చివరి క్షణంలో ఏ మార్పులు జరిగినా దానికి తగినట్లుగానే స్పందించారన్నారు. ఇవాంకా పర్యటన ముగించుకునే వెళ్లే ముందు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు డిజిపి మహేందర్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారని ముఖ్యమంత్రి గుర్తు చేసారు.