రాష్ట్రీయం

రేపు విజయవాడలో తెలుగు మహాసభల సన్నాహక సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రచయితలు, కవులు, కళాకారులను ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనాలని ఆహ్వానించేందుకు ఈ నెల 4న విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ ఎస్‌వి సత్యనారాయణ, తెలంగాణ బిసి కమిషన్ సభ్యులు, ప్రముఖ కవి జూలూరి గౌరీశంకర్ తదితరుల నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు.
ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, 2017 డిసెంబర్ 15 నుండి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని, అలాగే తోటి తెలుగు రాష్ట్రానికి సముచిత ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించారు. డిసెంబర్ 4 న సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ (హనుమాన్‌పేట) ప్రెస్‌క్లబ్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సభలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రచయితలు, కవులు, కళాకారులు హాజరు కావాలని నర్సింహారెడ్డి కోరారు.