రాష్ట్రీయం

ఏటేటా పెరుగుతున్న పైశాచికత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: పసిపిల్లల పట్ల నేరాలు, లైంగిక దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశం మొత్తం మీద 2016లో 98,344 నేరాలు నమోదయ్యాయి. 2014లో 79,758, 2015లో 85189 నేరాలు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోప్రకటించింది. బాలలపై నేరాలకు పాల్పడిన కేసులను విశే్లషిస్తే ఉత్తరప్రదేశ్ ఒకటో స్థానంలో, రెండో స్థానంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ 16, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచాయి. తెలంగాణలో 2909 నేరాలు, ఆంధ్రాలో 1847 నేరాలు నమోదయ్యాయి. కాగా తెలంగాణలో బాలలపై నేరాల్లో పెరుగుదల, ఆంధ్రాలో తగ్గుదల కనపడడం విశేషం. ఆంధ్రాలో 2015లో 1992 నేరాలు, 2016లో 1847 నేరాలు, తెలంగాణలో 2015లో 2697 నేరాలు, తెలంగాణలో 2909 నేరాలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2016లో 54 మంది బాలలు హత్యకు గురయ్యారు. పిల్లలను హత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ఘటనలు ఒకటి, హత్యాయత్నాల కేసులు ఐదు నమోదయ్యాయి. పిల్లల కిడ్నాప్ కేసులు 494, కిడ్నాప్ చేసి సొమ్మును గుంజే కేసులు 2, బాలల అక్రమ రవాణా కేసులు 2, ప్రకృతి విరుద్ధ లైంగిక హింస కేసులు 7 నమోదయ్యాయి. పిల్లల పట్ల ఐపిసి నేరాలు మొత్తం 589 నమోదయ్యాయి. లైంగిక నేరాల చట్టం నుంచి 830 మంది పిల్లలను రక్షించారు. కాగా 459 మంది బాలలు అత్యాచారానికి గురయ్యారు. లైంగిక దౌర్జన్యాలకు 237 మంది బాలలు గురయ్యారు. 51 లైంగిక వేధింపుల కేసు నమోదయ్యాయి. తెలంగాణలో బాలలపై హింసకు సంబంధించి ఐపిసి సెక్షన్ల కింద 983 కేసులు నమోదయ్యాయి. 48 మంది పిల్లలు హత్యకు గురయ్యారు. పిల్లలు ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలు 3, పిల్లలను హత్యయత్నం చేసిన ఘటనలు మూడు నమోదయ్యాయి. పిల్లల కిడ్నాప్ కేసులు 759 నమోదయ్యాయి. బాలికలను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసిన కేసులు 161 నమోదయ్యాయి.బాలల అక్రమ రవాణా కేసులు 23, వ్యభిచారం రొంపిలో బాలలను దింపిన కేసులు 1, ప్రకృతి విరుద్ధ లైంగిక హింస కేసులు 4 నమోదయ్యాయి. బాలలపై అత్యాచారాలకు పాల్పడిన కేసులు 690, లైంగిక దౌర్జన్యం కేసులు 189, లైంగిక వేధింపుల కేసులు 178 నమోదయ్యాయి. దేశం మొత్తం మీద బాలలపై వివిధ రకాల దాడులు, నేరాలకు పాల్పడిన వారిపై 2016లో 1,06,958 కేసులు నమోదయ్యాయ.