రాష్ట్రీయం

సంబరాలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 3: ‘కాపు రిజర్వేషన్లను ఓకే చేసి కేంద్రానికి పంపించాం. దాన్ని సాధించుకుందాం. ఈలోపు సంబరాలు చేసుకుని మరొకరికి ఇబ్బంది కలిగించవద్దు. బీసీల వ్యవహారంపై ఆయా వర్గాలకు నచ్చచెప్పి వివరించే బాధ్యతను మంత్రులు తీసుకోవాలి. మనం సమాజంలో వెనుకబడిన కులాలందరి పక్షాన ఉన్నాం. అన్ని కులాలు పేదరికం నుంచి బయటపడాలన్నదే మన సిద్ధాంతం. బీసీలు మన పార్టీకి పునాదిరాళ్లు. వారికి నచ్చచెప్పి వాస్తవాలు వివరించే బాధ్యత మీరే తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీ మంత్రులను ఆదేశించారు. ఆదివారం
ఆయన హైదరాబాద్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కాపు రిజర్వేషన్ ప్రకటన అనంతర పరిణామాలపై బాబు సమీక్షించారు. రిజర్వేషన్ ప్రకటించి పార్టీ చిత్తశుద్ధి చాటుకుందని ముద్రగడ పద్మనాభం సహా కాపు నేతలంతా వ్యాఖ్యానించిన నేపథ్యంలో, దానికి సంబంధించి పార్టీకి చెందిన కాపు నేతలెవరూ సంబరాల లాంటివి చేసుకోవద్దని సూచించారు. మన పనులు మరొకరికి ఇబ్బందికరంగా, సమస్యలు తీసుకురాకుండా ఉండాలని వ్యాఖ్యానించారు. కాపులను మనమెప్పుడూ ఓటుబ్యాంకుగా చూడలేదని, వారి పేదరికం చూసే తాను ఎవరూ అడగకుండానే రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించానన్నారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చినందువల్ల బీసీలకు ఉన్న రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని, కాపులకు వేరే కేటగిరిలో ఇచ్చినందున ఎవరూ ఆందోళన చెందవద్దన్న సంకేతాలిచ్చే బాధ్యత బీసీ మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించి, లోకేష్ పర్యవేక్షించాలని, టీడీ జనార్దన్ వీరందరితో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ‘మనది బీసీల పార్టీ. మనకు బీసీలే పునాది. వాళ్లకు అన్యాయం జరిగే ఏ పనీ మనం చేయం. కాపులకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వనందున బీసీల రాజకీయ ప్రయోజనాలకు వచ్చే ప్రమాదమేదీ ఉండదు. ఈ విషయాన్ని మీరు బీసీల వద్దకు తీసుకువెళ్లి, వారిని శాంతపరచాలి’ అని సూచించారు. కాపులకు రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడిన పార్టీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రకటనల పైనా చర్చించారు. కాపు రిజర్వేషన్‌పై పార్టీలో అందరితో చర్చించిన తర్వాతే మేనిఫెస్టోలో పెట్టామని, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడటం మంచిదికాదన్నారు. తెలంగాణకు చెందిన కృష్ణయ్యకు ఇక్కడేం పని అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారంతా వారి రాష్ట్రాల సమస్యలను చూసుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. కొన్ని పార్టీలు, నేతలు తమ రాజకీయ లబ్ధి కోసం కులాలను రెచ్చగొడుతున్నాయని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలను మీరంతా ఎప్పటికప్పుడు పరిశీలించి, పార్టీకి నష్టం జరగకుండా చొరవ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.