రాష్ట్రీయం

మోసాలు, అబద్ధాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, డిసెంబర్ 3 : రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలతో మభ్యపెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. వైకాపా అధికారంలోకి వస్తే మద్య నిషేధాన్ని 3 దశల్లో చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం జగన్ ఆదోని డివిజన్‌లోని జి.ఎర్రగుడి గ్రామంలో నిర్వహించిన రైతు ఆత్మీయసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ రైతులను దళారులకు అప్పజెప్పారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో రైతులకు ఒక్క ఏడాదైనా గిట్టుబాటు ధర కల్పించారా అని ప్రశ్నించారు. ప్రతి పెండింగ్ ప్రాజెక్టు లంచాల మయంగా మారిపోయిందని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వస్తే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. చంద్రబాబు చివరకు రాష్ట్రం వృద్ధి రేటును 12శాతంగా చూపుతూ ప్రజలను మాయమాటలతో మోసం చేస్తున్నారన్నారు. నిజంగా వృద్ధి 12శాతం ఉంటే ఏపీ యూరప్ దేశాల కంటే అగ్రస్థానంలో ఉన్నట్లే అన్నారు. చంద్రబాబుకు మనస్సాక్షి ఉంటే ఈ విషయంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. పులిచింతల ప్రాజెక్టు సమస్యను పరిష్కరించకపోవడం వల్ల రాష్ట్రం 45 టీఎంసీల నీటిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 22శాతం వర్షం లోటు ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రతిసారి మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తున్నారని, అయితే వారు అందులో కరవు పరిస్థితులపై చర్చించడం లేదని మండిపడ్డారు. దీనికి తోడు కరవు ప్రాంతాలను ప్రకటించకపోవడం వల్ల రాయలసీమ ప్రాంతంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువ కింద 140 టీఎంసీల నీరు ఉన్నా రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఎడమ కాలువ ద్వారా తెలంగాణ రైతులు పంటలు పండిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రాజెక్టు కాంట్రాక్టర్లను కమీషన్లకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. పట్టిసీమ బదులుగా పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఉంటే గోదావరి జలాలు కృష్ణాకు మళించే అవకాశం ఉండేదన్నారు. పట్టిసీమ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఆ నీరు వృథాగా కృష్ణబ్యారేజీ గుండా సముద్రంలో కలుస్తున్నాయన్నారు. అయినా సీఎం చంద్రబాబు నిజాలు చెప్పకుండా ప్రజలను మోసం చేయడం సరికాదని విమర్శించారు.
చిత్రం..ఆదోని డివిజన్‌లోని ఎర్రగుడి గ్రామంలో జరిగిన రైతు ఆత్మీయ సభలో మాట్లాడుతున్న వైఎస్ జగన్