రాష్ట్రీయం

పవన్ వెనక టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 7: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నారని వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా శింగనమల మండలం కల్లుమడిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీల బృందం పోలవరం ప్రాజెక్టును పరిశీలించడానికి వెళ్తోందని తెలిసి పవన్ వచ్చారన్నారు. సినిమాలు తీసుకుంటూ ఎక్కడో ఉంటున్న ఆయన ఏదిచేసినా మూడు రోజుల హడావుడిగా ఉంటుందన్నారు. ‘వైఎస్‌ఆర్ హయాంలో అవినీతి జరిగిందని పవన్ అంటున్నారు.. దాన్ని ప్రత్యక్షంగా చూశారా? అప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అవినీతిమయమైతే ప్రజా రాజ్యం పార్టీ అందులో ఎందుకు విలీనం చేశారని నిలదీశారు. ఆ విలీనంలో ఎంత అవినీతి జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. ‘రాజకీయాల్లో అనుభవం గురించి పవన్ మాట్లాడుతున్నారు.. ఏ అనుభవం ఉందని ఎన్నికలకు 6 నెలల ముందు పీఆర్‌పీని ప్రారంభించారు?’అని జగన్ అన్నారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని అంటున్నా సీఎం చంద్రబాబును, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి వచ్చే నిధులను పక్కదారి పట్టించారని, దీంతో ఆ ప్రాజెక్టు అవినీతికి నిలయంగా మారిందన్నారు. దీంతో కేంద్రం నిధులు ఇవ్వడం ఆపేసిందని అన్నారు. తమ పార్టీ అవినీతిపై పోరాటం చేస్తుండగా బురద జల్లేలా పవన్ మాట్లాడటం సరికాదన్నారు. ఇదంతా టీడీపీ ఆయనతో ఆడిస్తున్న నాటకమని అన్నారు. డ్రెడ్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమస్యల్ని తొలుత పార్లమెంట్‌లో ప్రస్తావించింది తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అని ఆయన గుర్తుచేశారు.

చిత్రం..సంకల్పయాత్రలో జగన్