రాష్ట్రీయం

మీ డ్రామాలు కట్టిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకానికి ఇకనైనా తెరదించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రధానాంశాలన్నీ కూడా వివాదాస్పదమవుతున్నాయని ఆయన తెలిపారు. వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలకు స్పష్టత, వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పోలవరంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని చంద్రబాబుకు సూచించారు. విజయవాడలోని దాసరి భవన్‌లో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలవరం, అమరావతి నిర్మాణాలకు కేంద్రమే సహకరించాల్సి ఉన్నప్పటికీ అందుకు అనుగుణంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మోదీ చెంబుడు నీళ్లు, ముంతడు మట్టి తీసుకొచ్చి ప్రజల ముఖాన కొట్టారన్నారు. రాష్ట్రం పట్ల కేంద్రం చాలా చులకన భావంతో వ్యవహరిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలంటే పెరిగిన అంచనాల ప్రకారం రూ.58,319 కోట్లు అవసరమవుతాయని లెక్కలు చెబుతున్నాయన్నారు. జాతీయ ప్రాజెక్టు కనుక మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాల్సి ఉందన్నారు. అయితే కేంద్రం రూ.23వేల కోట్లను నాబార్డు నుంచి రుణంగా అందచేస్తామంటున్నందున మిగిలిన మొత్తాన్ని ఎవరు భరించాలని ఆయన ప్రశ్నించారు. ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2800 కోట్లను కూడా ఇవ్వలేదన్నారు.