రాష్ట్రీయం

సుజలాం సుఫలాం ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 7: నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సమీక్షలు జరిపిన సందర్భంలో ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది మరొకటని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, కనె్నపల్లి, తుపాకులగూడెం బ్యారేజీలను త్వరితగతిన పూర్తిచేసి వచ్చే ఖరీప్ సీజన్‌కు నీరందేలా చూడాలని ఆయన ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు అవసరమైతే షిఫ్ట్‌లను పెంచి పనులను చేపట్టాలని అధికారులకు, కాంట్రాక్టు సంస్థలకు సూచించారు.
ఆయన గురువారం నాడు సాగునీటి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. కనె్నపల్లి వద్ద పంప్‌హౌస్ పనులు నత్తనడకన సాగుతున్నాయని గమనించిన ముఖ్యమంత్రి చీఫ్ ఇంజనీర్‌పై, కాంట్రాక్టు సంస్థపై అసంతృప్తి వ్యక్తం చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, తుపాకులగూడెం బ్యారేజీల పనులను, కనె్నపల్లి పంప్‌హౌస్
పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఉదయం 10-20 గంటలకు ఏటూరు నాగారం మండలం తూపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న ‘పివి నరసింహారావు కంతనపల్లి బ్యారేజీ’ వద్దకు ఆయన చేరుకుని నిర్మాణం పనులను పరిశీలించారు. పనులు నత్తనడకన నడవటాన్ని నిలదీస్తూ ఎన్ని షిప్పులలో పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పనులు చేపడుతున్న వాప్‌కోస్ సంస్థ ప్రతినిధి ఒక షిఫ్టులోనే పనులు జరుగుతున్నాయని చెప్పగా, మూడు షిఫ్టులలో పనులు నిర్వహించేలా పనులు చేపట్టి త్వరిగతిన పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మహదేవ్‌పూర్ మండలం మేడిగడ్డకు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ జరుగుతున్న రిజర్వాయర్ పనులను పరిశీలించారు. అక్కడ పనులు త్వరిగతిన జరగటంపై సంతృప్తి వ్యక్తం చేస్తునే మరింత వేగం పెంచాలని, వచ్చే మే నెల నాటికి నిర్మాణాలు పూర్తిచేయాలని సూచించారు. భూసేకరణలో ఇబ్బందులను పనులు చేపడుతున్న ఎల్ అండ్ టి సంస్థ ప్రతినిధి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, ఏ సమస్య ఉన్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజిపిని సంప్రదించాలని చెప్పారు. కొన్ని ప్రాంతాలలో పనులు చేపట్టేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పగా, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అవసరమైన పోలీసు భద్రత ఏర్పాటు చేసామని, అవసరమైతే మరింత భద్రత కల్పిస్తామన్నారు. అవసరమైతే మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సంప్రదించాలని డిజిపికి సూచించారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రత ఏర్పాటు చేసామని, డ్రోన్ కెమెరాలతో ప్రాజెక్టు పరిసరాలను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారని డిజిపి తెలిపారు. అనంతరం అన్నారం బ్యారేజీ, కనె్నపల్లి సంప్‌హౌజ్ నిర్మాణం పనులను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. కనె్నపల్లి వద్ద పనుల్లో జాప్యంపై చీఫ్ ఇంజనీర్‌పై, కాంట్రాక్టర్లపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసారు.
ముఖ్యమంత్రి వెంట ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, డిజిపి మహేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఇఎన్‌సీ మురళీధర్, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..భూపాలపల్లి జిల్లా తుపాకులగూడెం వద్ద బ్యారేజీ పనుల ప్రగతిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
*
ఏతమెత్తినపుడె ఏడుగడ సాగురా
నీటిపారుదలతొ నిండు పొలము
పసిడి పండినపుడె బతుకైన పండురా
కేసియారు మాట కెంపు మెరుపు