రాష్ట్రీయం

భూసర్వే..దాదాపు కొలిక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూమి సర్వే పనులు 85 శాతం పూర్తికావడంతో ఇందుకు సంబంధించిన రికార్డుల కంప్యూటీకరణపై దృష్టిని సారించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభించిన సంగతి విదితమే. మొత్తం 10975 గ్రామాల్లో 7300 గ్రామాల్లో భూమి సర్వే ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి.
వంద రోజుల్లోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్దేశించారు. మొదటి దశలో వివాదంలోని అంశాలు అంటే పేర్లను సరిదిద్దడం, భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లపై స్పష్టత తదితర అంశాల పనులను ఈ నెలాఖరులోపల పూర్తి చేస్తారు. రెండవ దశలో లిటిగేషన్ ఉన్న భూములు, కోర్టు కేసులు ఉన్న భూములు, వాటికి పరిష్కార మార్గాలపై రికార్డులను తయారు చేస్తారు. ఇంతవరకు రెవెన్యూ బృందాలు, ప్రత్యేక బృందాలు 1.50 కోట్ల ఎకరాల రికార్డులను తనిఖీ చేశారు. ఇందులో 1.23 కోట్ల ఎకరాల భూములు వివాదరహితమని తేల్చారు. రైతులకు రికార్డ్స్ ఆఫ్ రైట్స్ పత్రాలను అందిస్తున్నారు. కాగా రాష్ట్రంలో దేవాలయాలు 12వేల వరకు ఉన్నాయి. వీటి ఆధీనంలో 85,195 ఎకరాలు ఉన్నాయి. ఇందు లో 14వేల ఎకరాల వరకు ఆక్రమణల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జనవరి నెల నుంచి దేవాలయాలపైన భూములను రిజిస్ట్రేషన్ చేయించాలని దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ ఇప్పటికే నిర్ణయించాయి.
ప్రస్తుతం భూమిసర్వే జరుగుతున్నందున దేవాలయ భూముల ఆక్రమణదార్లను గుర్తించేందుకు రెవెన్యూ అధికారులకు దేవాదాయ శాఖ అధికారులు సహకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కొన్ని ప్రముఖ దేవాలయాల భూములు ఆక్రమణలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. పాత ఆదిలాబాద్ జిల్లాలో 111 దేవాలయాల పరిధిలో 3563 ఎకరాల భూమి ఉన్నట్లు పాత రికార్డులు చెబుతుంటే, 1810 ఎకరాలు స్వాధీనంలో ఉన్నట్లు తేలింది. దేవాలయ భూములు ఆక్రమణలకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్నతాధికారుల సమావేశం జరగనుంది. హైదరాబాద్ జిల్లాలో విలువైన 90 ఎకరాల, 18 గుంటల భూములను పరిరక్షించేందుకు రాష్ట్రప్రభుత్వ ఆదేశం మేరకు కంచెలను నిర్మిస్తున్నారు.