రాష్ట్రీయం

ప్రజా పోరాటాలకు సిద్ధంకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐసీసీ నాయకులు కుంతియా, రేణుకాచౌదరి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామం వద్ద గురువారం రాత్రి జరిగిన పార్టీ బహిరంగ సభలో వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఏదో చేస్తామంటూ హామీలిచ్చి వాటిని కాంగ్రెస్ అడ్డుకున్నదంటూ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆచరణ సాధ్యంకాని హామీలిస్తూ వాటిని నెరవేర్చలేక కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని తాము చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, అప్పటి నుంచే నిధుల కేటాయింపులు జరుగుతున్నాయని, ఇప్పుడు అవి పూర్తవుతుంటే తాము చేశామని చెబుతున్నారన్నారు. హైదరాబాద్ మెట్రో కూడా అదే కోవకు చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే భూసేకరణతో పాటు పనులు కూడా ప్రారంభమైన విషయాన్ని గుర్తుచేశారు. నాడు మెట్రోను అడ్డుకుంటామని చెప్పిన కేసీఆర్ నేడు తాము ప్రజల కోసం పూర్తిచేశామని చెప్పడం దారుణమన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి తమ స్వప్రయోజనాల కోసం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. తన మాటలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తూ మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.

చిత్రం..బహిరంగసభకు ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్ నేతలు