రాష్ట్రీయం

చేసిందే చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: ‘వ్యక్తులు వస్తుంటారు... పోతుంటారు. కానీ తెలంగాణలో పార్టీ చెక్కు చెదరలేదు. కార్యకర్తలు బలంగా, ఆత్మవిశ్వాసంతో పార్టీనే నమ్ముకుని ఉన్నారు..’ అని తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వచ్చే ఏడాది జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి నుంచి మార్చి 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకు (70 రోజులు) ‘పల్లె పల్లెకు టిడిపి’ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో టి.టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. జనవరి 18 ఎన్టీఆర్ వర్ధంతి నుంచి మార్చి 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకూ చేపట్టాల్సిన పల్లె పల్లెకు టిడిపి కార్యక్రమాలపై చర్చించారు. ఈనెల 9 నుంచి వచ్చే నెల 17 వరకూ పల్లె పల్లెకు టిడిపి కార్యక్రమాలకు సంబంధించిన సన్నాహక ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పల్లె పల్లెకు టిడిపి సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. హైటెక్, హైటెక్స్, రోడ్ల వెడల్పు, రింగ్ రోడ్డు, ట్యాంక్ బండ్, బుద్ధ విగ్రహం, శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. ఇలా చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించాలని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు, గ్రామాల్లోని సిమెంట్ రోడ్లు, నిర్మించిన ఆసుపత్రులు కనిపిస్తున్నాయన్నారు. హెచ్‌ఐసీసీలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సమావేశం జరిగిందని, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్‌తో పాటు అనేక మంది ప్రపంచ పారిశ్రామిక వేత్తలు మనం వేసిన
రోడ్లపైనే తిరిగారని చెప్పారు. సోషల్ మీడియాలో నాడు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తిరిగాయన్నారు. అభివృద్ధి చేసిన ఎకో సిస్టమే ఇప్పటికీ కొనసాగుతున్నదని ఆయన తెలిపారు.
నెలకోసారి సమీక్ష..
ఇకమీదట ప్రతి నెలకు ఒకసారి పార్టీ కార్యక్రమాలను సమీక్షిస్తానని ఆయన చెప్పారు. ప్రతి గురువారం తాను ఎక్కడ ఉన్నా పార్టీ తెలంగాణ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతానని, మీరు చేపట్టిన కార్యక్రమాల గురించి తెలుసుకుంటానని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరి పని తీరుపై రిపోర్టు తనకు వస్తుందన్నారు. పార్టీ బలహీనపడిందన్న భావనను తొలగించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన వంటి క్లిష్ట సమయంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కూడా పార్టీకి తెలంగాణలో 22 శాతం ఓట్లు లభించాయని, 15 అసెంబ్లీ సీట్లు వచ్చాయని, మిత్రపక్షమైన బిజెపితో కలిసి 20 స్థానాలు దక్కించుకున్నామని అన్నారు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోజు పార్టీ ఆఫీసుకు వచ్చేవాడినని, అలా పని చేయడం వల్లే తిరిగి అధికారంలోకి రాగలిగామని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఉన్న పట్టుదల, అంకితమైనభావం ఏ పార్టీలోనూ కనిపించదని అన్నారు. క్యాడర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పార్టీకి బలమని ఆయన చెప్పారు. పార్టీ కమిటీలన్నింటినీ పూర్తి చేసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలపై పోరాటం చేయాలని ఆయన సూచించారు.
ఇలాఉండగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో వర్సిటీకి వెళ్ళి గాయపడిన టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు నరేందర్ గౌడ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించి, ధైర్యం చెప్పారు.

చిత్రం..టి.టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు