రాష్ట్రీయం

భక్తులకు టైం స్లాట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 8: సర్వదర్శనం భక్తులు కంపార్ట్‌మెంట్‌లో వేచి ఉండకుండా త్వరితగతిన శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఈనెల 18 నుంచి ప్రయోగాత్మకంగా టైంస్లాట్ విధానాన్ని అమలు చేస్తామని టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తిరుమలలోని 14 ప్రాంతాల్లో 117 కౌంటర్లు ఏర్పాటు చేశామని, మొదటి 5 నుంచి 7 రోజులపాటు ప్రయోగాత్మకంగా భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామన్నారు. ఆధార్‌కార్డు ద్వారా భక్తులు సర్వదర్శనం టోకెన్లు పొందవచ్చని, టోకెన్లు పొందిన భక్తులను దివ్యదర్శనం కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని ఆయన చెప్పారు. భక్తుల సూచనలు, సలహాలను పరిగణలోనికి తీసుకుని రెండు నెలల తరువాత పూర్తిస్థాయిలో టైంస్లాట్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఆధార్‌కార్డు లేని భక్తులు యథావిధిగా సర్వదర్శనం కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.