రాష్ట్రీయం

కడప, ఖమ్మం జిల్లాల్లో ఉక్కు కర్మాగారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట,డిసెంబర్ 8: రాష్ట్రంలోని కడప జిల్లా, తెలంగాణలోని ఖమ్మం జిల్లాల్లో త్వరలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటవుతాయని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉక్కు కర్మాగారాల నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం జరిగిన అనిబిసెంట్ మున్సిపల్ స్కూల్ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ కర్మాగారాలకు సంబంధించిన ఫైళ్లు కేంద్ర మంత్రుల వద్ద ఉన్నాయన్నారు. 10 రోజుల్లో వీటికి సంబంధించిన నివేదికలు అందుతాయన్నారు. ఆ వెంటనే ఉక్కు కర్మాగారాల నిర్మాణాలకు తాను సహకరిస్తానని అన్నారు. ఇటీవల కేంద్ర ఉక్కుశాఖ మంత్రిని కలిశానని కడప, ఖమ్మం జిల్లాల్లో ఉక్కు కర్మాగారాల నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు చూశానన్నారు. దీనిపై కేంద్రమంత్రితో సైతం మాట్లాడానని చెప్పారు.