రాష్ట్రీయం

మజ్లిస్ అజెండాను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 8: మజ్లీస్ పార్టీ ఎజెండాను రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తూ మతతత్వ శక్తులను ప్రోత్సహిస్తోందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. నిజాంను కీర్తిస్తూ తెలంగాణ అమర వీరులను అమానపరచే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవనిర్మాణ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం పరిపాలనపై చేస్తున్న వ్యాఖ్యానాలకు తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని ఆవేదన చెందారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రామరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నానికి ప్రజలు బ్రహ్మరథం పట్టాలని కోరారు. దేశంలోని 18రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ విజయం సాధిస్తోందన్నారు. 60 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పాలకులు కుంభకోణాలమయంగా మార్చి లక్షల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. చిన్న రాష్ట్రాలయిన గోవా, సిక్కిం, జార్ఖండ్‌లలో జరిగిన ఎన్నికల్లో సైతం బీజేపీకే ప్రజలు పట్టంగట్టారని గుర్తు చేశారు.
అవినీతిరహిత దేశంగా భారతదేశాన్ని రూపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీజేపీ కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు.

చిత్రం.సభలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్