రాష్ట్రీయం

నాణ్యతపై రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 9: ప్రతి ఇంట్లో పేదవారు సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే చంద్రన్న కానుకల ద్వారా అందించే వస్తువుల నాణ్యతలో రాజీ పడబోమని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం స్థానిక గొల్లపూడి మార్కెట్ యార్డులోని మండల్ లెవల్ స్టాక్ పాయింట్ (ఎంఎస్‌ఎల్) గోడౌన్‌లో పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం మంత్రి మాట్లాడుతూ పౌర సరఫరాలశాఖ ద్వారా పేద ప్రజలకు ఇస్తున్న చంద్రన్న క్రిస్‌మస్ కానుక, సంక్రాంతి కానుకల ద్వారా ఇచ్చే కందిపప్పు, బెల్లం, గోధుమపిండి, పంచదార నాణ్యతమైనవి ఇవ్వాలనేదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, పేద ప్రజలకు అందించే వస్తువుల ద్వారా వారు సంతోషంగా పండుగ చేసుకోవడానికే ఇవి ఇస్తున్నామన్నారు. అలాంటివి నాసిరకంగా ఉంటే సహించేది లేదన్నారు. ఇక్కడ మండల్ లెవల్ స్టాక్ పాయింట్‌లో కందిపప్పు నాణ్యత విషయంలో తక్కువ ప్రమాణాలతో ఉందన్నారు. ఇలాంటి కందిపప్పును సరఫరా చేసినవారు ఆ సరుకును తిరిగి మార్చి దాని స్థానంలో మంచి కందిపప్పును ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తామన్నారు. అలాకాని పక్షంలో అవసరమైతే వాటిని తయారుచేసిన నాగపూర్‌కు చెందిన సోను- మోను కంపెనీని బ్లాక్ లిస్టులో పెడతామని తెలిపారు. అదేవిధంగా పంచదార కూడా నాణ్యత తక్కువగా ఉన్నట్టు తన తనిఖీల్లో తేలిందన్నారు. నిత్యావసర సరుకుల ధరల విషయంలో మార్కెట్‌లో ధరల్లో వ్యత్యాసాలతోపాటు వస్తువుల్లో మూడు, నాలుగు రకాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు. దానివలన ధరల వ్యత్యాసంతో పాటు మంచి చెడు వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలకు తక్కువ ధరలకే అందించేవారు ఎవరైనా ముందుకు వస్తే ప్రభుత్వానికి కూడా డబ్బు ఆదాతోపాటు, ఖర్చు తగ్గుతుందని, అలాంటివారు ఎవరైనా ముందుకు వస్తే వారికి అవకావం కల్పిస్తామని తెలిపారు. మార్కెట్‌లో కందిపప్పు ధర 53 రూపాయలకు దొరుకుతున్నట్లు వివిధ దినపత్రిల్లో వార్తలు వచ్చాయని, అలా తక్కువ ధరకు నాణ్యత కలిగిన కందిపప్పును పేద ప్రజలకు అందించేవారు ముందుకు వస్తే వారిని ప్రోత్సహిస్తామన్నారు. రివర్స్ బిడ్డింగ్‌లో ఎవరు తక్కువకు కోడ్ చేస్తే టెండర్లలో వారికే ఇస్తామని, ఆ విధంగా ప్రభుత్వానికి తక్కువ ధరలకు ఎవరు సరఫరా చేసినా వారికి అవకాశం కల్పిస్తామన్నారు. అదే విధంగా శనగపప్పు ధరలు కూడా తక్కువకు సప్లయ్ చేస్తామనే వారికి అవకాశం కల్పిస్తామని అలాంటివారు ఎవరైనా ఉంటే ముందుకు రావలసిందిగా కోరారు.
సరుకుల సరఫరాలో, నాణ్యత విషయంలో అవకతవకలు జరిగినట్టు తెలిస్తే విజిలెన్స్ ఎంక్వైరీ వేయించి దర్యాప్తు చేయిస్తామని, చంద్రన్న కానుకల ద్వారా ఇచ్చే వస్తువుల్లో నాణ్యతలో ఎక్కడా రాజీపడేది లేదని, అలాంటివి ఏమైనా ఉంటే ఎవరైనా పరిష్కార వేదిక కాల్ సెంటర్ 1100కు ఫోన్‌చేసి తెలియజేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు వస్తువుల నాణ్యత, ధరలపై ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారన్నారు. పేద ప్రజలకు అందించే వస్తువుల్లో రాజీలేకుండా నాణ్యతతో కూడినవిగా అందించడంతోపాటు వారు సంతోషంగా పండుగ చేసుకునేలా ఉండాలనేదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్యాస్ సిలిండర్లలో తక్కువ బరువు ఇవ్వడాన్ని, ఎరువుల బస్తాల్లో తక్కువ కిలోలు ఇవ్వడాన్ని, పెట్రోల్ బంకుల్లో మోసాలను, నకిలీ విత్తనాలను అరికట్టగలిగామన్నారు. గోడౌన్ తనిఖీ కార్యక్రమంలో సివిల్ సప్లయ్‌స్ జిల్లా మేనేజర్ వరకుమార్, ఇన్‌ఛార్జి డిఎస్‌వో పి.ప్రసాదరావు, ఎఎస్‌వో-1 శ్యామ్‌కుమార్, ఎఎస్‌వో-2 ఉదయ్‌భాస్కర్ పాల్గొన్నారు.

చిత్రం..ఎంఎస్‌ఎల్ గోడౌన్‌లో కందిపప్పు నాణ్యతను పరిశీలిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు