రాష్ట్రీయం

నిండా ముంచిన బీటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, డిసెంబర్ 9: లాభాల వాణిజ్య పంటగా పేరున్న బీటీ పత్తి రైతులను నిలువునా ముంచింది. అధిక దిగుబడి ఆశతో బీటీ పత్తి సాగుచేసిన రైతులు ఈసారి పూర్తిగా నష్టపోయారు. ప్రారంభంలో దిగుబడి బాగా వస్తుందని ప్రచారం సాగడంతో ఎక్కువ మంది బీటీ పత్తి సాగు చేశారు. కాలానుగుణంగా బీటీ పత్తి విత్తనం పనితీరులో మార్పు చోటు చేసుకుని పంట దెబ్బతినడం ప్రారంభమైంది. మహారాష్టల్రో బీటీ పత్తి విత్తనం పంటకు పింక్‌వామ్ రోగం సోకడంతో 95 శాతం పత్తిపంట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. బీటీ పత్తి విత్తనం 2007లో రైతులకు అందుబాటులోకి రావడంతో విరివిగా సాగుచేశారు. పంట సాగు చేసిన తొలి రోజుల్లో అధిక దిగుబడులు సాధించారు. అప్పట్లో బీటీ పత్తికి చీడపీడలు సోకవని పెద్దఎత్తున ప్రచారం జరగడంతో ఈ విత్తనంపైనే రైతులు మక్కువ చూపారు. రాష్ట్రంలో బీటి పత్తి పంట 75 శాతం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పత్తి నాణ్యత పూర్తిగా లోపించింది. విత్తనాలు రంగు మారడంతో ధర కూడా పూర్తిగా తగ్గిపోయిందని వ్యాపారులు అంటున్నారు. పండిన పత్తిలో కూడా గొగ్గి శాతం ఎక్కువగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు రంగు మారింది. ఫలితంగా క్వింటాలు రూ.5 వేలకు అమ్ముకోవాల్సిన పత్తి రూ.3 వేలకే విక్రయించే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో పత్తి సీజన్ ముగిసినట్టేనని వ్యాపార వర్గాలు అంటున్నాయి. చీడపీడలు సోకి పంట దెబ్బతినడంతో ఎండిపోయిన పంటను కాల్చి వేయాలని ప్రభుత్వమే రైతులకు సూచిస్తోంది. అరకొరగా చేతికొచ్చిన పంట అధిక వర్షాల వల్ల తేమ ఎక్కువగా ఉండడంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసిన దూది బేళ్లను తిప్పి పంపుతున్నారు. చీడపీడలకు తట్టుకుని నిలిచే బీటీ పత్తివిత్తనం పని అయిపోయిందని, విత్తనాలను మార్చాలని రైతులు కోరుతున్నారు. బీటీ పత్తి సాగువల్ల భూసారం మొత్తం ఒకేసారి తీసుకోవడం వల్ల పంట పొలాల్లో భూసారం కూడా తగ్గిపోయిందని రైతులు, వ్యవసాయ అధికారులు అంగీకరిస్తున్నారు. గతంలో లాగానే సంప్రదాయ వ్యవసాయ విత్తనాన్ని రైతులు పండించుకోవడం మంచిదని వ్యవసాయ శాస్తవ్రేత్తలు సూచిస్తున్నారు.
సీజన్ ప్రారంభంలో దేశవ్యాప్తంగా పత్తి సీజన్ ఆశాజనకంగా ఉంటుందని అఖిల భారత పత్తి వ్యాపారుల సంఘం
అంచనా వేసింది. సుమారు 4.20 కోట్ల పత్తి బేళ్లు ఉత్పత్తి అవుతాయని భావించారు. దేశంలో అధికంగా పత్తి పండించే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఈసారి పంట బాగా దెబ్బతింది. ఫలితంగా 3.70 కోట్ల బేళ్లు మాత్రమే వస్తామని లెక్కలు కడుతున్నారు. మార్కెట్‌కు అమ్మకానికి వస్తున్న పత్తిలో 75 శాతం నాణ్యత లేకుండా ఉంటోంది. ఈసారి పత్తి సీజన్ మార్చి, ఏప్రిల్ వరకు ఉండే అవకాశం ఉంది. దీంతో పత్తి బేళ్లను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయకుండా పెద్దఎత్తున స్థానికంగా నిల్వ చేస్తున్నారు. మహారాష్టల్రో 95 శాతం వరకు పంట దెబ్బతినడం వల్ల ఆప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది. క్వింటాల్ పత్తి ధర రూ.3,800 ఉండగా గత వారం నుంచి పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌లో క్వింటాల్ రూ.4,500 నుంచి రూ.5 వేలకు కొనుగోలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా దూది బేళ్ల ధర కూడా పెరిగింది. వారం క్రితం 356 కిలోల దూది బేలు ధర రూ.36 వేల నుంచి రూ.38 వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ.37 వేల నుంచి రూ.39 వేలకు పెరిగింది. ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. దీంతో బేళ్లను నిల్వ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బీటీ పత్తి విత్తనం ప్రభావం తగ్గడంతో ఆ ప్రభావం పత్తి మార్కెట్‌పై పడింది. అంతేగాక రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతిలో విత్తనాలను స్వయంగా తయారు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.

చిత్రాలు....ఆదోని మార్కెట్‌కు వచ్చిన పత్తి బేళ్లు. *వ్యాపారులు నిల్వ చేస్తున్న దూది బేళ్లు