రాష్ట్రీయం

బీసీలకు బాబు ఎసరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్లదినె్న, డిసెంబర్ 9: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని బీసీలను మోసం చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఎస్టీల్లో చేరుస్తామని కుల సంఘాలను బురిడీ కొట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సంకల్పయాత్ర 30వ రోజు శనివారం అనంతపురం జిల్లా గార్లదినె్న మండలంలో కొనసాగింది. గార్లదినె్నలో ఏర్పాటుచేసిన బీసీల సదస్సులో జగన్ మాట్లాడుతూ నాలుగేళ్ల టీడీపీ పాలనలో బీసీలు అడుగడుగునా అన్యాయానికి గురయ్యారన్నారు. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. కురబలు, బోయలను ఎస్టీల్లో చేరుస్తామన్నారు, రజకులను ఎస్సీల్లో చేరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారన్నారు. ఈ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా కుల రాజకీయాలు చేస్తున్నారన్నారు. మొన్నటికి మొన్న బోయలను ఎస్టీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేసి బిల్లు కేంద్రానికి పంపారన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి నాయకులకు ఫోన్ చేసి కేక్‌లు కోసి పండుగ చేసుకోమన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయాలని ఇతర కులాల వారిని రెచ్చగొడతారు. ఇలా కుల రాజకీయాలు చేస్తూ బీసీలను మోసం చేస్తున్న చంద్రబాబుకు చమరగీతం పాడాలన్నారు. తాను బాబు కంటే చిన్నవాడినే కానీ, మోసం చేసే వాడిని కాను అన్నారు.
ధర్మవరంలో 35 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు పరామర్శించిన పాపాన పోలేదన్నారు. చేనేత కార్మికులు 37 రోజులుగా నిరాహారదీక్ష చేస్తే వారి సమస్యలు పట్టించుకోలేదన్నారు. ఎన్నికల ముందు మగ్గం ముందు కూర్చుని ఫొటోలకు ఫోజులు ఇచ్చాడేకాని చేనేతల సమస్యలు పట్టించుకోలేదన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని, ఇళ్లు కట్టిస్తానని, రూ.లక్ష వడ్డీలేని రుణం ఇస్తానని చెప్పి ఇంతవరకు చేసిందీమేలేదన్నారు. బీసీలపై బాబు చూపుతున్నది కపట ప్రేమ అన్నారు. పేదరికం నుంచి బీసీలను గట్టెక్కించేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్నో పథకాలు అమలుచేశారన్నారు. ప్రతి పేదవాడు తమ పిల్లల్లో ఒకరిని ఇంజినీరు, డాక్టరు చదివించాలని, అందుకు అప్పు చేయకూడదన్న ఉద్దేశ్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రకటించారన్నారు. ఆయన ఆశయం నెరవేరిందని, నేడు ఎంతో పేదలు చదువుకుని ఇంజినీర్లుగా,
డాక్టర్లుగా మారారన్నారు. చంద్రబాబు పాలనలో ఇంజినీర్లు కావాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిందేనన్నారు.
దేవుడు కరుణించి మీ అందరి ఆశీస్సులతో వైకాపా అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడతానని జగన్ అన్నారు. బీసీ విద్యార్థులు ఏ రాష్ట్రంలోనైనా డాక్టర్, ఇంజినీరు చదువులు చదివినా మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తామన్నారు. మెస్ బిల్లు రూ. 20 వేలు అదనంగా చెల్లిస్తామన్నారు. చిన్నపిల్లలను పాఠశాలకు పంపితే రూ. 15 వేలు తల్లి ఖాతాలో జమచేస్తామన్నారు. 45 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేస్తామన్నారు. పెన్షన్ రూ. 2 వేలకు పెంచుతామన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తెస్తామన్నారు.
చిత్రం..గార్లదినె్నలో నిర్వహించిన బీసీల సదస్సులో ప్రసంగిస్తున్న వైసీపీ అధినేత జగన్