రాష్ట్రీయం

ఎడమ కాల్వకు సాగర్ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 9: ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ఎడమకాలువ ఆయకట్టు రైతాంగానికి యాసంగి పంటల సాగు కోసం నేటి నుండి వారబందీ పద్ధతిలో నీటి విడుదల చేయనున్నారు. జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి ఆదివారం ఉదయం 9:30 నిమిషాలకు సాగర్ ఎడమకాలువకు నీటి విడుదల చేయనున్నారు. నాగార్జున సాగర్ డ్యాం 63వ శంకుస్థాపన దినోత్సవం సందర్భంగా సాగర్ ఎడమకాలువకు నీటి విడుదల చేయనుండటం విశేషం. 1955 డిసెంబర్ 10వ తేదీన ఆనాటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ సాగర్ డ్యాంకు శంకుస్థాపన చేశారు. ఈ దఫా యాసంగి ఆరుతడి పంటల సాగు నిమిత్తం ఎడమకాలువ పరిధిలోని ఆయకట్టుకు సాగర్ జలాశయ నుండి 40 టీఎంసీల నీటిని వారబందీ పద్ధతిలో
ఆదివారం నుండి ఏప్రిల్ 5వరకు ఎనిమిది విడతలుగా విడుదల చేయనున్నారు. ఆన్ ఆఫ్ పద్ధతిలో ఆరు రోజులు వరుసగా నీటిని విడుదల చేసి, తొమ్మిది రోజులు నిలిపివేసి నీటి విడుదల సాగించనున్నారు. రైతులు మాత్రం ఎక్కువగా వరిసాగు చేసేందుకు నారుమడులతో సిద్ధమవుతున్నారు. శనివారం నాటికి సాగర్ జలాశయలో 559.3 అడుగులు, 239 టీఎంసీల నీటి నిల్వ ఉండగా కుడి కాలువకు 3508 క్యూసెక్టులు, పవర్ హౌస్ ద్వారా కృష్ణా డెల్టాకు 4593 టీఎంసీలు, ఎఎమ్మార్పీకి 1800 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.
ఎడమకాలువ పరిధిలో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలో మొత్తం 6 లక్షల 45 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో మొదటి జోన్‌లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో 3.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ప్రస్తుతం ఎడమకాలువ ద్వారా 2.62 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వనున్నారు. రెండో జోన్‌లోని ఖమ్మం జిల్లాలో 2.65 లక్షల ఎకరాలకుగాను 1.83 లక్షల ఎకరాలకు మాత్రమే నీటి సరఫరా చేయనున్నారు. మొదటి జోన్ పరిధిలో 25 టీఎంసీలు, రెండో జోన్ పరిధిలో 15 టీఎంసీలు విడుదల చేస్తారు. మొత్తం ఎడమకాలువ పరిధిలోని ఆయకట్టుకు 65 టీఎంసీల నీటి విడుదల అవసరముండగా ప్రస్తుతం 40 టీఎంసీలు మాత్రమే విడుదల చేయనున్నారు. గత ఏడాది ఆగస్టు 25న కృష్ణ పుష్కరాలు ముగిసిన పిదప సాగర్ ఎడమకాలువకు నీటి విడుదల చేసి 30 టీఎంసీల నీటిని ఆ సీజన్‌లో అందించారు.
నీటి విడుదల ఇలా..!
సాగర్ ఎడమకాలువ ఆయకట్టుకు మొదటి విడతగా ఈనెల 10వ తేదీ నుండి 21వ తేదీ వరకు నీటి విడుదల చేస్తారు. డిసెంబర్ 28 నుండి జనవరి 5 వరకు రెండో విడత, జనవరి 12 నుండి 20 వరకు మూడో విడత, 27 నుండి ఫిబ్రవరి 4 వరకు నాల్గవ విడత, ఫిబ్రవరి 11నుండి 19 వరకు ఐదో విడత, 26 నుండి మార్చి 6 వరకు ఆరో విడత, మార్చి 13 నుండి 21 వరకు ఏడో విడత, మార్చి 28 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఎనిమిదవ విడత నీటిని విడుదల చేయనున్నారు.