రాష్ట్రీయం

కొత్త చట్టమే ప్రామాణికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణలో భూసేకరణ చట్టం అమలుపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చట్టం ప్రకారమే భూసేకరణ చేయాల్సి వస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చట్టం 2017 ప్రకారమే చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2013 చట్టం కన్నా 2017 చట్టం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. నిర్వాసితుల భవనాలు, షెడ్డులకు ధర నిర్ణయించినట్లే బోర్లకు కూడా ధర నిర్ణయించాలన్నారు. బోర్లకు ఆర్ డబ్ల్యుఎస్ చెట్లకు ధర నిర్ణయించినట్లే బోర్లకు కూడా ధర నిర్ణయించాలన్నారు. శనివారం ఇక్కడ ప్రగతిభవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే అనంతసాగర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లపై ఆయన సమీక్షించారు. పంపుసెట్లలో మోటార్లను పరిశీలించేందుకు 26 మంది ఇంజనీర్లతో కూడిన ప్యానెల్‌ను నియమించారు. ఈ ప్యానెల్‌లో నీటిపారుదల శాఖకు చెందిన 16 మంది, విద్యుత్ శాఖకు చెందిన 10 మంది ఇంజనీర్లు ఉంటారు. రైతుల సమన్వయంతో విద్యుత్ లైన్లను వేయాలని, దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులతో కరీంనగర్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. రామడుగు నుంచి వచ్చే నీటిని వరద కాల్వతో కలిపే ప్రదేశంలో నీటి ప్రవాహ ఉధృతిని తట్టుకునే పటిష్ట నిర్మాణం చేయాలని, డిజైన్లను తయారు చేయాలన్నారు. మిడ్‌మానేరు నిండిన తర్వాత బ్యాక్‌వాటర్ మేనేజిమెంట్ కూడా ముఖ్యమన్నారు. వరద కాల్వలోకి కాళేశ్వరం నీరు వచ్చిన తర్వాత ఉండే పరిస్థితిని అంచనా వేసి డిజైన్లు రూపొందించే బాధ్యతను ఇఎన్‌సి మురళీధర్‌కు అప్పగించారు. మిడ్ మానేరు నిర్మాణం పూర్తయిందని, రివిట్‌మెంట్ చేస్తున్నామని, 25 గేట్లకు , 10 గేట్లను బిగించామని బండ్‌పై రోడ్డు కూడా నిర్మిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. జనవరి నెలాఖరుకల్లా మిడ్ మానేరుకు సంబంధించిన పనులు వందశాతం పూర్తి కావాలని సీఎం చెప్పారు. 25 టిఎంసి నిల్వ చేసేందుకు సిద్ధం కావాలన్నారు. గౌరవెల్లి వరకు ఆయకట్టుకు నీరివ్వడానికి డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణాల కోసం అవసరమైన భూసేకరణ కోసం వెంటనే 80 కోట్ల రూపాయలను విడుదల చేయాలని సీఎం ఆర్థిక శాఖను ఆదేశించారు. గౌరవెల్లి ద్వారా 80 వేల ఎకరాలకు నీరందించేందుకు నిర్మాణాలు చేపట్టాలన్నారు. మల్కపేట రిజర్వాయర్ భూసేకర పూర్తయిందని, అటవీ అనుమతులు కూడా వచ్చాయని ముఖ్యమంత్రి చెప్పారు. అటవీ ప్రాంతంలో చెట్ల గణన పూర్తి చేసి రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించాలని అటవీ శాఖను కోరారు. హుస్నేబాద్, సిరిసిల్ల ప్రాంతాలు తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలని, మిడ్ మానేరు నుంచి గౌరవెల్లి మల్కపేటకు త్వరగా నీళ్లివ్వడం వల్ల అక్కడి రైతులకు మేలు కలుగుతుందని ముఖ్యమంత్రి సూచించారు.