రాష్ట్రీయం

రెండేళ్లలో 34 శాతం పెరిగిన రైల్వేలో నేరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: రైళ్లలో ప్రయాణం రోజు రోజుకీ ఆందోళనకరంగా మారుతోంది. నేరాల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. దేశ వ్యాప్తంగా 2016 డిసెంబర్ వరకు రైల్వేలో వివిధ స్థాయిల్లో జరిగిన నేరాల జాబితాను విశే్లషించిన జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) తన నివేదికలో రైళ్లలో ప్రయాణం ప్రమాదభరితంగా మారుతున్నట్లు స్పష్టం చేసింది. గత రెండేళ్లలో రైల్వేలో నేరాలు 34 శాతం పెరిగాయి. ఐపిసి చట్టం, స్పెషల్ లోకల్ లా (ఎస్‌ఎల్‌ఎల్), స్థానిక పోలీసు చట్టాల ప్రకారం నేరాల సంఖ్య ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో ఉన్నాయి. ఐపిసి కింద ప్రభుత్వ రైల్వే పోలీస్ (జిఆర్‌పి) నమోదు చేసిన హత్యలు, మానభంగాలు, దాడులు, కిడ్నాప్‌లు, దొంగతనాల కేసులను పరిశీలించిన ఎన్‌సిఆర్‌బి సమగ్ర నివేదికను విడుదల చేసింది. దీనిలో 2014లో 31,609, 2015లో 39,239 కేసులు నమోదు కాగా, 2016 డిసెంబర్ నాటికి ఏకంగా 42,388 కేసులు నమోదయ్యాయి. ఒక్క 2016లో నమోదైన కేసుల్లో వీటిన్నంటిని క్రోఢీకరించి ఐపిసి, జిఆర్‌పి, ఎస్‌ఎల్‌ఎల్ చట్టాల కింద కేసులన్నీ కలిపితే ప్రథమ స్ధానంలో ఉత్తర్ ప్రదేశ్‌లో 10,918 కేసులు నమోదు కాగా, తర్వాత వరుసగా మహారాష్టల్రో 7,684, కేరళలో 7,678, గుజరాత్‌లో 6,561, మధ్యప్రదేశ్‌లో 5,253 కేసులు నమోదైనట్లు ఎన్‌సిఆర్‌బి స్పష్టం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ జిఆర్‌పిలో ఐపిసి ఎస్‌ఎల్‌ఎల్ చట్టం కింద నమోదైన కేసులు 2016 నాటికి ఆరు శాతం పెరగ్గా, తెలంగాణలో ఏడు శాతం పెరిగాయి. ఎపిలో 2014లో 1786, 2015లో 1809, 2016లో 1893 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో 2014లో 897, 2015లో 1124, 2016లో 1277 కేసులు నమోదయ్యాయి. కాగా ఎస్‌ఎల్‌ఎల్ చట్టాల కింద జిఆర్‌పి నమోదు చేసిన కేసులు ఎపిలో 76, తెలంగాణలో 141 నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 2016లో నమోదైన మొత్తం కేసుల్లో 33,682 దొంగతనాల కేసులే అధికంగా ఉన్నాయి. అలాగే 236 హత్యలు, 125 హత్యాయత్నం కేసులు, 79 మానభంగం కేసులు, 53 దోపిడీ, 112 దాడి కేసులు దేశ వ్యాప్తంగా నమోదైనట్లు బ్యూరో నివేదిక వెల్లడించింది. రైల్వేలో శాంతిభద్రతలను ఆయా రాష్ట్ర స్థానిక పోలీసు యంత్రాంగ పర్యవేక్షించి కేసులు నమోదు చేస్తుంది. చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడే వారిని ఐపిసి, జిఆర్‌పి చట్టాల కింద కేసులు నమోదు చేస్తుంది. జిఆర్‌పిలో ప్రోహిబిషన్ చట్టాన్ని అనుసరించి గుజరాత్‌లో 3,815 కేసులు నమోదు కాగా, మహారాష్టల్రో 114, కేరళలో 87 కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు అదనంగా కేంద్ర చట్టాన్ని అనుసరించి పని చేసే రైల్వే రక్షణ దళం చట్టం కింద కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగానే కేసులు నమోదయ్యాయి. ఎపిలో 2015లో 51,076, 2016లో 69,689 కేసులు నమోదు కాగా, తెలంగాణలో 2015లో 9,869, 2016లో 15,516 కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే అధికంగా 2016లో 2,23,360 కేసులు నమోదైతే ఆ తర్వాత స్ధానంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో 1,24,720 కేసులు నమోదైనట్లు ఎన్‌సిఆర్‌బి స్పష్టం చేసింది. దీంతో జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్‌ల్లో నేరాల నమోదు క్రమేణా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదని స్పష్టమవుతోంది.