రాష్ట్రీయం

దొరికిన మరో డ్రగ్స్ రాకెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. వారంలో మూడు కేసులు నమోదయ్యాయి. ఆదివారం మల్కాజ్‌గిరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారినుంచి భారీగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో 200 కేజీల గంజాయి, 70 గ్రాముల కొకైన్ పట్టుబడగా, మల్కాజ్‌గిరిలో ఆదివారం హెరాయిన్, కిలో ఓపియం పట్టుబడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో నైజీరియన్లు ఈ అక్రమ దందాకు పాల్పడగా, మల్కాజ్‌గిరిలో రాజస్థాన్‌కు చెందిన వారు పట్టుబడ్డారు. సోను, వర్ధన్‌గుప్తా అనే ఇద్దరు వ్యాపారులు హైదరాబాద్‌లోని పరిశ్రమలో పనిచేస్తూ, యువకులకు మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. కొంతకాలంగా గంజాయి, హెరాయిన్, ఓపియంను నగరంలోని కళాశాలలు, పబ్‌లు, బార్‌అండ్ రెస్టారెంట్‌ల వద్ద యువకులకు అమ్ముతున్నారు. హెరాయిన్‌తో పట్టుబడిని ముఠా సభ్యులను పోలీసులు విచారించగా ఇప్పటివరకు
దాదాపు డజనుకు పైగా వినియోగదారులకు సరఫరా చేసినట్టు తేలింది. అయితే ఈ డ్రగ్స్ హైదరాబాద్‌కు ఎలా వస్తున్నాయనే విషయమై ఆరా తీయగా, హెరాయిన్ గోవా నుంచి సరఫరా అవుతున్నట్టు, ఓపిఎం నగరశివారులోని కొన్ని ఖాయిలాపడ్డ పరిశ్రమల్లో తయారవుతున్నట్టు పోలీసుల విచారణంలో వెల్లడైనట్టు తెలిసింది. నిందితులపై మాదకద్రవ్యాల నిరోధక చట్ట కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు మల్కాజ్‌గిరి పోలీసులు తెలిపారు.

చిత్రం..పోలీసులకు చిక్కిన డ్రగ్స్ ముఠా సభ్యులు