రాష్ట్రీయం

తేడా వస్తే.. బ్లాక్‌లిస్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: మిషన్ భగీరథ పనులు నెలాఖరుకు పూర్తి చేసి జనవరి 1నుంచి నూతన సంవత్సర కానుకగా ఇంటింటికి మంచినీటిని సరఫరా చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. నూతన సంవత్సరం నుంచి ఇంటింటికి మంచినీటిని అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించడంతో, నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయని కాంట్రాక్టు ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిషన్ భగీరథ పనుల కాంట్రాక్టులు పొందిన ఏజెన్సీలతో గ్రామీణ మంచినీటి సరఫరా పథకం ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. ప్రభు త్వం విధించిన గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్ట్ ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. పనులకు సంబంధించిన బిల్లులను ఈనెల 30 తర్వాత సమర్పిస్తే చెల్లించేది లేదని స్పష్టం చేశారు. ఇంటింటికి మంచినీరు సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన గడువుకు మరో 20 రోజులు మాత్రమే ఉండటంతో అసంపూర్తిగా ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఈఎన్‌సి ఆదేశించారు. మంచినీటి సరఫరాలో ఎలక్ట్రో మెకానికల్ పనులు కీలకమైనవని, అవసరమైతే నిపుణుల బృందాల సంఖ్యను పెంచి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. గడువులోగా పనులు పూర్తి చేయని ఏజెన్సీలు ఎంతటి వారివైనా వదిలిపెట్టేది లేదని ఈఎన్‌సి సురేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఇలాఉండగా మిషన్ భగీరథ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం. రాష్టవ్య్రాప్తంగా 25 వేల గ్రామాలకు, 67 పట్టణ, నగరాల్లోని ఆవాసాలకు శుద్ధిచేసిన మంచినీటిని అందించే ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇంటింటికి మంచినీటిని అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రూ. 42 కోట్ల వ్యయంతో రాష్టవ్య్రాప్తంగా 5 వేల కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేసిన పైపులైన్ల ద్వారా ఇంటింటికి మంచినీటిని అందించే లక్ష్యంతో దీనిని చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 150 లీటర్ల చొప్పున శుద్ధి చేసిన మంచినీటిని అందించే విధంగా ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేసారు. గోదావరి, కృష్ణానదీ జలాలతో పాటు ప్రతీ నీటిపారుదల ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథకు నీటిని కేటాయించింది. ప్రాజెక్టుల్లో మంచినీటి అవసరాల కోసం 10 శాతం నీటిని కేటాయిస్తూ చట్టం తేవడం తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లో 2017 డిసెంబర్ నెలాఖరుకు భగీరథను పూర్తి చేసి 2018 జనవరి ఒకటి నుంచి నూతన సంవత్సర కానుకగా ఇంటింటికి మంచినీటిని సరఫరా చేసే లక్ష్యం మేరకు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.

చిత్రం..ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయంలో మిషన్ భగీరథ వర్కింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమైన ఈఎన్‌సి సురేందర్‌రెడ్డి