రాష్ట్రీయం

కొలువుల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 3943 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ప్రభుత్వం జీవో 179ను జారీ చేసింది. సివిల్ సర్జన్‌లు, ఆర్‌ఎంఓలు -483, డిప్యుటీ సివిల్ సర్జన్లు -685, సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లు -1191, డెంటల్ సివిల్ సర్జన్లు -12, డిప్యుటీ డెంటల్ సర్జన్లు-16, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు-10, అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మిన్ గ్రేడ్ -1 పోస్టులు -2, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు 16, సూపరింటెండెంట్/సెక్షన్ ఆఫీసర్లు -32, సీనియర్ అసిస్టెంట్లు -30, జూనియర్ అసిస్టెంట్-56 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఫార్మసీ సూపర్ వైజర్ -01, ఫార్మసిస్టు గ్రేడ్ -1 పోస్టులు ఆరు, ఫార్మసిస్టు గ్రేడ్ -2 పోస్టులు 52, ల్యాబ్ టెక్నీషియన్ -152, హెల్త్ ఇనస్పెక్టర్లు-09, చీఫ్ రేడియోగ్రాఫర్-07, రేడియోగ్రాఫర్ -33, డార్క్ రూమ్ అసిస్టెంట్ -36, ఫిజియోథెరపిస్టు -45, రిఫ్రాక్షనిస్టు -34, జూనియర్ అనలిస్టు -44, ఆప్తాలమిస్టు అసిస్టెంట్ -22, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ -01, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1 పోస్టులు 28, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2 పోస్టులు 38, హెడ్ నర్సు -162, స్ట్ఫా నర్సు-565, మిడ్ వైఫ్స్ -126, ఎఎన్‌ఎంలు 49 పోస్టులను భర్తీ చేస్తారు.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఔదార్యంతో వచ్చిన ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని వైద్య మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తెలిపారు. అడిగిందే తడవుగా వైద్య సమస్యలు తెలిసి పోస్టుల మంజూరీకి సిఎం ఆదేశించారని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ వైద్య శాలల్లో ఆధునిక వసతులు పెంచడం కొత్తగా ఆస్పత్రులను నిర్మించడం, ఉన్న వైద్యశాలలను అప్‌గ్రేడ్ చేయడం కెసిఆర్ కిట్ల పథకం వంటి అనేక చర్యలు తీసుకోవడం వల్ల ప్రభుత్వ వైద్య శాలలకు రోగుల రాక పెరిగిందని అన్నారు. దీంతో ఇంత వరకూ కొంత మేరకు ఉన్న కొరత తాజాగా చేపట్టిన నియామకాలతో తీరుతుందని అన్నారు. భారీ ఎత్తున డాక్టర్లు, సిబ్బంది వస్తారని
అన్నారు. ఒక్క తెలంగాణలోనే వైద్య విధాన పరిషత్‌తోనే 3943 పోస్టులు వస్తాయని అన్నారు. ఇవే గాక మిగతా విభాగాల్లోనూ అనేక పోస్టులు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ నియామకాలు ప్రభుత్వ వైద్య శాలలకు వచ్చే రోగులకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వీలవుతుందని అన్నారు
వైద్య సంఘాలు హర్షం
మరోవైపు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 3943 పోస్టులు రావడంపై వివిధ వైద్యసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ పల్లం, ఉపాధ్యక్షుడు డాక్టర్ నరహరి, కోశాధికారి డాక్టర్ లాలూ సంతోషం వ్యక్తం చేశారు. వైద్య రంగ సమస్యలే గాక, వైద్యులు సిబ్బంది సమస్యలను తెలిసిన సిఎం కెసిఆర్ వైద్య ఆరోగ్యమంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, కమిషనర్ వాకాటి కరుణలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్టుల నియామకాలు పూర్తయితే ఒక వైపు వైద్యులు, సిబ్బంది కొరత తీరడమేగాక, మరో వైపు రోగుల నుండి వైద్యం అందించడానికి వీలవుతుందని అన్నారు. వైద్యులపై భారం తగ్గుతుందని అన్నారు.