రాష్ట్రీయం

విజయ్‌సాయి అంత్యక్రియలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: హాస్య నటుడు విజయ్‌సాయి అంత్యక్రియలు మంగళవారం ఎర్రగడ్డలోని శ్మశానవాటికలో జరిగాయి. విజయ్ తండ్రి సుబ్బారావు, భార్య వనితల పరస్పర ఆరోపణ, ప్రత్యారోపణల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. సినిమాల్లో అవకాశాలు రాకపోవడం, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో ఇతను ఆత్మహత్యకు పాల్పడినట్టు అంతా భావించారు. కానీ, ఆత్మహత్యకు ముందు విజయ్‌సాయి తీసుకున్న సెల్ఫీ వీడియోలో ముగ్గురిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన చావుకు భార్య వనిత ప్రవర్తనతో పాటు పారిశ్రామిక వేత్త శశిధర్, న్యాయవాది శ్రీనివాస్ వేధింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజయ్ వీడియోలో పేర్కొనడంతో విజయ్ ఆత్మహత్యోదంతపై పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే న్యాయవాది శ్రీనివాస్, పారిశ్రామికవేత్త శశిధర్, విజయ్ భార్య వనితపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా, మంగళవారం విజయ్ అంత్యక్రియల నేపథ్యంలో విజయ్ తండ్రి సుబ్బారావు తీవ్ర ఆరోపణలు చేశారు. విజయ్ భార్య మంచిది కాదని, ఆమె ప్రవర్తనతో విసుగెత్తిన విజయ్ విడాకులకు సిద్ధమయ్యాడన్నారు. సమయం వచ్చినప్పుడు నిజాలు ఆధారాలతో బయటపెడతానన్నారు. ఓ న్యాయవాది, మరో వ్యాపారవేత్తతో కలసి తన కొడుకును తీవ్ర మనస్థాపానికి గురిచేశారని సుబ్బారావు ఆరోపించారు. కాగా, వనిత మాట్లాడుతూ, విజయ్ ఆత్మహత్యకు కారణం తండ్రీ,కొడుకుల మధ్య ఆస్థి తగాదాలేనన్నారు. విజయ్‌కు దూరంగా ఉంటున్నప్పటికీ తనకు విజయ్ అంటే ఎంతో ఇష్టమన్నారు. విజయ్ ఆత్మహత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదని వనిత స్పష్టం చేశారు. ఇదిలావుండగా విజయ్‌సాయి భార్య పేరు వనిత కాదని, ఆమె అసలు పేరు వరలక్ష్మి అని పోలీసులు గుర్తించారు. అదేవిధంగా వనిత పాస్‌పోర్టులో ఒక పేరు, స్కూల్ సర్ట్ఫికెట్‌లో మరో ఉందని గుర్తించారు. అంతేగాక వనిత స్కూల్ సర్ట్ఫికెట్, పాస్‌పోర్టులో వేరువేరుగా తండ్రి పేర్లు ఉండడం గమనార్హం. ఈ కేసులో పలు కోణాల్లో జూబ్లీహిల్స పోలీసులు విచారం జరపగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. వనిత తల్లి రఫీ అనే వ్యక్తితో సహజీవనం చేసిందని, దీంత రఫీకి విజయ్‌సాయి ఆత్మహత్యతో ఏమైనా సంబంధముందా..అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ అనే న్యాయవాదికి, వనితకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వీరికి నోటీసులిచ్చిన అనంతరం అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.