రాష్ట్రీయం

కొత్త రైల్వేలైన్ల నిర్మాణాలు పూర్తి చేయండి: జీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: కొత్త రైల్వేలైన్ల నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. మంగళవారం రైల్వే డివిజనల్ మేనేజర్లతో ఆయన సమావేశమయ్యారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరం ప్రతిపాదిత పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు సమన్వయంతో పూర్తి చేసేందుకు యత్నించాలని సూచించారు. కొత్త రైల్వే నిర్మాణ పనుల పూర్తి లక్ష్యంగా అధికారులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలన్నారు. నడికుడి-శ్రీకాళహస్తి, మనోహరబాద్-కొత్తపల్లి, అక్కన్నపేట్-మెదక్, నంద్యాల-ఎర్రగుంట్ల, ఎంఎంటిఎస్ రెండో ఫేజ్ పనులపై దృష్టి సారించాలన్నారు. ప్రయాణికుల అవసరాలు, కాపలాలేని క్రాసింగ్‌ల వద్ద భద్రత, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్డు కింది బ్రిడ్జిలు, ప్లాట్ ఫారంల విస్తరణ, ట్రాక్ డబ్లింగ్ వర్క్సు, ట్రాక్ ట్రిప్లింగ్ వర్క్సు, కొత్త లైన్ల పనులు సమీక్షించాలని జీఎం డివిజన్ మేనేజర్లను కోరారు.