రాష్ట్రీయం

అది బాబు ఘనతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌ను మేటిగా నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు కొనియాడారు. ప్రఖ్యాత మెక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్‌కు రావడం కానీ, ఐటీ రంగంలో అభివృద్ధి చెందడానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు ఎంతో కృషి అమోఘం అని కెటిఆర్ పొగడ్తలతో ముంచేత్తడం విశేషం. హైటెక్ సిటీలో గురువారం టెక్ మహేంద్రా క్యాంపస్‌లో జరిగిన మిషన్ ఇన్నోవేషన్-2018 కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ ప్రసంగిస్తూ ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా మంచి నగరమని, భవిష్యత్‌లో అది కూడా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేసారు. ఒక్క రోజులో హైదరాబాద్ అభివృద్ధి చెందలేదు, ఈ నగరానికి 450 ఏళ్ల చరిత్ర ఉందని గుర్తు చేసారు. టి-హబ్ ఫేజ్-2ను వచ్చే సంవత్సరం ప్రారంభిస్తామన్నారు. అలాగే త్వరలో స్టార్టప్ కేంద్రంగా
మారుస్తామన్నారు. దైనందిక జీవితంలో టెక్నాలజీ కీలక భూమిక పోషిస్తుందని, ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో ఇది మరీ ప్రధానమైందన్నారు. వౌలిక వసతుల కల్పనలో దేశంలోనే హైదరాబాద్ నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రపంచశ్రేణి ప్రమాణాలతో నగరాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చుతున్నామని మంత్రి కెటిఆర్ అన్నారు. క్లీన్ అండ్ గ్రీన్‌లో నగరాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపబోతున్నామన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు టిసాట్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతుందన్నారు. టెక్ మహేంద్రా కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చాలని మంత్రి సూచించారు.