రాష్ట్రీయం

ఆకాశమే హద్దుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరుగుతున్న సంబరాల్లో ప్రపంచ తెలుగు మహాసభలు అపూర్వంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ పండగలో భాగస్వామ్యం అవుతున్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటిలో జరుగుతున్న చర్చ ప్రపంచ తెలుగు మహాసభల గురించే. తోటి తెలుగు రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ భాష, సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీఠ వేస్తున్నారు. తెలంగాణలోని కవులు, రచయితలకు ఈ సందర్భంగా గుర్తింపు లభిస్తోంది. ఉగాది రోజు ప్రతి ఇంట్లో తెలుగు సంస్కృతి ఏ విధంగా వెల్లివిరుస్తుందో, అదే విధంగా ఇప్పుడు కూడా
ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొని ఉంది. వార్తాపత్రికల్లో ఈ సభల గురించి ప్రచురించిన వార్తలు, వ్యాసాలనే ప్రధానంగా చదువుతున్నారు. టివిలలో ప్రసారమవుతున్న ప్రపంచ తెలుగు మహాసభల గురించే ప్రధానంగా చూస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల పేరుతో మొబైల్ ఫోన్లలో అనేగ గ్రూపులు వెలిశాయి.
సాయంత్రం 5 గంటలకు షురూ..
ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతున్నాయి. ఎల్‌బి స్టేడియం ప్రధానవేదికగా నిలుస్తోంది. ప్రారంభ సభలు ఇక్కడి నుండే మొదలై, ఈ నెల 19 న ఇదే వేదికపై ముగుస్తాయి. ఎల్‌బి స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రధాన ప్రాంగణానికి పాల్కురికి సోమన పేరు పెట్టగా, ప్రధాన వేదికకు బమ్మెర పోతన పేరు పెట్టారు. ఈ సభలను భారత ఉపరాష్టప్రతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారు. ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావులు విశిష్ట అతిథులుగా హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగే ఈ సభలో 40 వేల నుండి 50 వేల మంది వరకు పాల్గొనే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. ప్రారంభ సమావేశంలో వెంకయ్యనాయుడు, నరసింహన్, విద్యాసాగర్‌రావు, కెసిఆర్ తప్ప ఇతరులు మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ సభలకోసం గత ఆరునెలల నుండి అహర్నిషలు కృషి చేసిన ఒకరిద్దరు మాట్లాడేందుకు కెసిఆర్ అవకాశం ఇవ్వచ్చని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన వెంటనే ఇదే వేదికపై సాంస్కృతిక సమావేశం, ప్రముఖ నాట్యాచార్యులు రాజారెడ్డి-రాధారెడ్డిల నేతృత్వంలో ‘మన తెలంగాణ’ సంగీత నృత్యరూపకం ఉంటుంది. అలాగే ప్రముఖ గాయకుడు రామాచారి బృందం చేత ‘జయ జయోస్తు తెలంగాణ’ సంగీత నృత్యరూపకం కూడా ఉంటుంది.
ప్రపంచ తెలుగు మహాసభల రెండోరోజు నుండి ఎల్‌బి స్టేడియంతో పాటు మిగతా ఐదు వేదికల వద్ద కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, రవీంద్రభారతి, రవీంద్రభారతి మినీ హాల్, తెలంగాణ సారస్వత పరిషత్‌లలో కార్యక్రమాలు ఉంటాయి. ఐదు ఉపవేదికల వద్ద ఉదయం 10 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమై సాయంత్రం నాలుగైదు గంటల వరకు ముగుస్తాయి. ఆ తర్వాత ఎల్‌బి స్టేడియంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత కార్యక్రమాలు మొదలవుతాయి.
*
ఇవీ ఆశయాలు
*
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేయడం.
తెలంగాణ సాహితీ మూర్తులకు, వారి కృషికి తగిన గౌరవం ఇవ్వడం.
తెలంగాణ కళావైభవాన్ని సాక్షాత్కరించడం.
ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్థిరపడ్డ తెలుగు వారి మధ్య సమన్వయం నెలకొల్పేందుకు ఈ సభలను వేదికగా వాడుకోవడం.
ఇప్పటివరకు ప్రచురణకు నోచుకోని ప్రముఖ తెలంగాణ రచయితల, కవుల రచనలను ప్రచురించడం.
తెలుగు భాషను ఆధునిక అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి చేయడం.
కొత్త తరానికి తెలంగాణ సాహిత్య స్పూర్తిని అందించడం.
తెలంగాణ ప్రజల్లో సాహిత్య సాంస్కృతిక ఉత్తేజం వెల్లివిరిసేలా చేయడం.
పోటీలు - బహుమతులు
గ్రామీణ స్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు ప్రపంచ తెలుగు మహాసభలపై అవగాహన కల్పించేందుకు రక రకాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు వివిధ వేదికలనుండి బహుమతులు అందిస్తారు.
*

తెలుగుల పండుగ కొరకై
వేలాదిగ తరలివచ్చు విజ్ఞుల కోసం
వెలుగుల అక్షర తోరణ
మాలికనే కూర్చినాము మోదము తోడన్