రాష్ట్రీయం

వేడెక్కిన మేడారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 14: ఆదివాసీలు, లంబాడీల మధ్య వివాదం సమ్మక్క-సారలమ్మ ట్రస్ట్‌బోర్డు ప్రమాణ స్వీకారం సందర్భంగా విధ్వంసానికి దారితీసింది. ట్రస్ట్‌బోర్డులో లంబాడీల పెత్తనం వద్దంటూ ఆగ్రహించిన ఆదివాసీలు గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్ కుమారుడు, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆజ్మీరా ప్రహ్లాద్‌పై దాడికి యత్నించారు. మేడారంలో గురువారం జరగవలసిన సమ్మక్క-సారాలమ్మ జాతర ట్రస్ట్‌బోర్డు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదివాసీల ఆగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులకు చెందిన 15కుపైగా వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఐటీడీఏ క్యాంపు ఆఫీసుకు నిరసనకారులు నిప్పు పెట్టగా పోలీసులు సకాలంలో మంటలను ఆర్పివేశారు. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ట్రస్ట్‌బోర్డును ఏర్పాటు చేసింది. ఎప్పటిలాగే ఆదివాసీలతోపాటు లంబాడా, నాయకపోడు, బిసి వర్గాలకు చెందినవారితో కమిటీని ఏర్పాటు చేసింది. కొత్త ట్రస్ట్‌బోర్డు ప్రమాణ స్వీకారానికి మంత్రి చందూలాల్ కుమారుడు ఆజ్మీరా ప్రహ్లాద్‌తోపాటు పాలకవర్గ సభ్యులు, వారి మద్దతుదారులు, అధికార పార్టీ నాయకులు, అధికారుల మేడారం చేరుకున్నారు. జాతరలో లంబాడాల పెత్తనం ఏమిటంటూ మంత్రి కుమారుడితో ఆదివాసీలు వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంలో ఇరువర్గాల మద్య వాగ్వివాదం, తోపులాట జరిగాయి. ప్రహ్లాద్ కారుతోపాటు, మరికొందరి కార్లపై రాళ్లతో దాడిచేసి అద్దాలు ధ్వంసం చేసారు. ఆదివాసీల ఆకస్మిక దాడికి మొదట బిత్తరపోయిన పోలీసులు రంగంలోకి దిగి వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. ఒక దశలో ప్రహ్లాద్‌పై వారు దాడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆదివాసీలు వెనక్కి తగ్గకపోవటంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ గందరగోళంతో ట్రస్ట్‌బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రద్దవగా పోలీసు బందోబస్తు మద్య అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివాసీల దాడుల విషయం తెలిసి భూపాలపల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్, ఏటూరు నాగారం ఏఎస్పీ రాహుల్ హెగ్డే అదనపు పోలీసు బలగాలతో సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు.
ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీలు ఆందోళనలు చేస్తుండటం, దీనికి ప్రతిగా లంబాడీలు రెండురోజుల కిందటే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో రెండువర్గాల మధ్య ఏర్పడిన వివాదంతో పరిస్థితి విషమించే ప్రమాదం ఏర్పడింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరా తీయటంతోపాటు ఇరువర్గాలు సంయమనంతో వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

చిత్రం..ఐటీడీఏ క్యాంపు కార్యాలయంపై దాడి చేస్తున్న ఆందోళనకారులు