రాష్ట్రీయం

500 మంది డిప్యూటీ కలెక్టర్ల విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ల విభజన కొలిక్కి వచ్చింది. ఇరు రాష్ట్రాలకు డిప్యూటీ కలెక్టర్లను కేటాయిస్తూ రాష్ట్ర అడ్వయిజరీ కమిటీ సభ్య కార్యదర్శి గురువారం నోటిఫికేషన్ జారీ చేసారు. ఇరు రాష్ట్రాలకు కేటాయించిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు సీనియార్టీ, స్థానికత, ఆప్షన్, ప్రాథమిక కేటాయింపు కూడిన జాబితాను విడుదల చేసారు. కేటాయించిన అధికారులు ఈ జాబితాపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా నోటిఫికేషన్ విడుదల అయిన రోజు నుంచి 14 రోజుల వ్యవధిలో తెలియజేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల సాధారణ పరిపాలనాశాఖకు ఈ జాబితాలను రాష్ట్ర అడ్వయిజరీ కమిటీ కార్యదర్శి అందజేసారు.