రాష్ట్రీయం

ఉద్యోగాల భర్తీలో రోస్టర్ విధానం పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 14: టీటీడీలో నాల్గవ తరగతి, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకాలకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడానికి తమవంతు ప్రయత్నం చేస్తామని, అయితే రోస్టర్‌ను పాటించి నియామకాలను చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభా షెడ్యూల్ కులాల సంక్షేమ కమిటీ ఛైర్మన్ టి.శ్రావణ్‌కుమార్ ఆదేశించారు. గురువారం టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓలు పోలా భాస్కర్, శ్రీనివాసరాజు ఇతర ఉన్నతాధికారులతో శాసన సభా కమిటీ స్థానిక పద్మావతి అతిథి భవనంలో సమావేశమైంది. ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు అందిస్తున్న సేవలు, ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రూరల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై సమీక్షించారు. ఈసందర్భంగా కమిటీ చైర్మన్ టి.శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ భక్తులకు సేవలు అందించడంలో ఏరోజుకారోజు సమస్యలను సరిదిద్దుకుంటున్న కారణంగా టీటీడీ అందిస్తున్న సేవలపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని, ఇది అభినందనీయమన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై కొంతమంది నుంచి ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించాలని ఈఓకు చెప్పారు. ఈసందర్భంగా ఈఓ సింఘాల్ మాట్లాడుతూ టీటీడీలో 13,455 పోస్టులకు గాను 3,708 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 2010లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా ఉద్యోగాల భర్తీని చేపట్టలేదన్నారు. గత పాలక మండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి నియామకాలకు అనుమతి కోరుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. టీటీడీలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ నియామకాల్లో కూడా రోస్టర్ పాయింట్ పాటిస్తున్నామన్నారు.