రాష్ట్రీయం

అమరావతికి నేను చాలా ఇవ్వాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15: ‘రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు మీలాంటి మేధావులు చాలా మంది కావాలి. ఎందుకంటే నేను అమరావతికి చాలా ఇవ్వాలి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలో జరుగుతున్న అమరావతి డీప్ డైవ్ వర్కుషాపు ముగింపు కార్యక్రమానికి శుక్రవారం సీఎం హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వర్కుషాపులో పాల్గొన్న వారంతా ఉత్తమ కన్సల్టెంట్లేనన్నారు. అమరావతిని ప్రపంచ శ్రేణి నగరంగా కాదని, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా నిర్మించాలని తాను భావిస్తున్నానని వెల్లడించారు. తాను నిత్య విద్యార్థినని, నిరంతరం నేర్చుకుంటూనే ఉంటానన్నారు. మరే నగరానికి నీరు, పచ్చదనం రెండూ ఉన్న దాఖలాలు లేవన్నారు. అవే అమరావతికి అదనపు వనరులన్నారు. ఇక్కడ నివసిస్తే, మరో 20 ఏళ్లపాటు జీవిత కాలం పెరుగుతుందన్నారు. సంపూర్ణ కాలుష్య రహిత నగరంగా నిర్మించాలనుకుంటున్నామన్నారు. ఉమ్మడి ఏపీని నాలెడ్జ్ ఎకానమీ స్టేట్‌గా తీర్చిదిద్దేందుకు ఎన్నో మేధోమథనాలు చేశామని గుర్తు చేశారు. హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని, 20 ఏళ్ల క్రితం సాంకేతిక విద్య గురించి తాను తీసుకున్న నిర్ణయం వల్ల అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటయ్యాయన్నారు. తాను చెప్పిన మాటల వల్ల తల్లితండ్రుల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చిందని, పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇచ్చి డబ్బు ఖర్చు చేశారన్నారు. ఆ తరువాత గ్లోబల్ విలేజ్ కానె్సప్టుతో ప్రపంచం నలుమూలలకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువాళ్లదే హవా అన్నారు. మార్కెటింగ్ రంగం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారని, మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడం వల్ల అందరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకునేలా
చేయగలిగానన్నారు. నూతన రాజధాని నగరం నిర్మించడం తనకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నానని, ఎన్నో నగరాలు నిర్మించుకునే అవకాశం రావచ్చన్నారు. కానీ పరిపాలనా నగరం నిర్మించుకోవడం అరుదుగానే వస్తుందన్నారు. సింగపూర్ వంటి నగరాన్ని నిర్మిస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చానన్నారు. ఎన్నికల తరువాత ఎటువంటి లాంఛనాలు లేకుండా తమ రాజధాని కోసం మాస్టర్ ప్లాన్ ఇవ్వగలరా? అని కోరారన్నారు. ఆరు నెలల్లో అద్భుతమైన మాస్టర్‌ప్లాన్‌ను ఇచ్చారన్నారు. తన పిలుపునకు స్పందించి రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. గతంలో చాలా నగరాలు నిర్మించారని, కానీ ఆ సమయంలో జరిగిన లోపాలను పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. అమరావతిని నిర్మించేందుకు ప్రపంచంలోని మేధావులందరి సేవలను వినియోగించుకుంటామన్నారు. రెండు రోజుల వర్కుషాపులో వచ్చిన సూచనలు పాటించి ప్రామాణిక నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, సీఆర్‌డీఏ కమిషన్ శ్రీ్ధర్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏడీసీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్ధసారథి తదితరులు పాల్గొన్నారు.