రాష్ట్రీయం

పదం.. ఒక అణుబాంబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: ఒక పదం ఎన్నో విస్ఫోటనాలను సృష్టించగల అణుబాంబు లాంటిదని తెలంగాణ విద్యుత్‌శాఖా మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లోభాగంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బిరుదురాజు రామరాజు ప్రాంగణంలో సామల సదాశివ వేదికపై నిర్వహించిన పద్య కవితా సౌరభం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భాష అవసరంగా పుట్టిన సాధనమని, ప్రపంచంలో ఎన్నో భాషలు ఉద్భవించి అంతరించిపోయాయని అన్నారు. అమ్మ భాషను మరిస్తే అన్నీ మరిచిపోయినట్టేనని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో భాషా సంస్కృతులను నాటి పాలకులు నాశనం చేశారని ఆరోపించారు. తెలంగాణ భాష వారికి కనిపించలేదని, అస్సలు పట్టించుకోలేదని, తెలంగాణ భాష, యాసపై దాడి జరిగిందని, ఆంధ్రులు విధ్వంసం చేశారని ఆరోపించారు. ఇపుడు సొంత రాష్ట్రం ఏర్పాటైనందున భాష సంస్కృతి, యాసలను పరిరక్షించుకునే గొప్ప అవకాశం కలిగిందని చెప్పారు. తెలంగాణ భాషను సుంసపన్నం చేసుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహాసభలను ఏర్పాటు చేసిందని వివరించారు. పిల్లలు తెలుగులో మాట్లాడే పరిస్థితి నేడు లేదని, రానున్న రోజుల్లో తెలుగులో మాట్లాడేవారు కరవు అవుతారని, అలాంటి పరిస్థితి రాకుండా మన ఉనికిని మనమే రక్షించుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన డాక్టర్ అమరేశం రాజేశ్వర శర్మ, దోర్బల విశ్వనాధ్ శర్మలకు ఘనసత్కారం చేశారు. ఈ సందర్భంగా కవులు తమ కవితలను వినిపించారు. అనంతరం మంత్రి వారిని అభినందించారు.

చిత్రం..పుస్తకావిష్కరణలో మంత్రి జగదీశ్ రెడ్డి