రాష్ట్రీయం

ప్రత్యామ్నాయంలోనే ‘పురుషోత్తపట్నం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 16: పట్టిసీమ స్ఫూర్తితో అఖండ గోదావరి నది ఎడమ గట్టుపై సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకం నిర్మాణం గడువు దాటినా నీళ్లు మాత్రం పోలవరం కాలువ దాటలేదు. ఏలేరు జలాశయానికి ప్రత్యామ్నాయ విధానంలోనే గోదావరి జలాలు అదించడం జరిగింది. అది కూడా 750 క్యూసెక్కులు మాత్రమే. వాస్తవానికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణ గడువు 9 నెలలు పూర్తయింది. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా గోదావరి జలాలను ఏలేరుకు అనుసంధానం చేయడం ఈ పథకం లక్ష్యం. కానీ ఇప్పటికీ అరకొరగానే లక్ష్యం నెరవేరింది. ఎందుకంటే ప్రత్యామ్నాయ విధానంలో మాత్రమే ఏలేరుకు ప్రాధమిక దశలో జలాలను చేరవేస్తున్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువకు మూడు చోట్ల రహదారుల క్రాసింగ్‌లు పూర్తి కాకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా పుష్కర కాలువను వాహకంగా వినియోగించుకుని ఎట్టకేలకు ఏలేరు జలాశయానికి గోదావరి జలాలను చేర్చడంలో విజయవంతమయ్యారు. కానీ పోలవరం కాలువ ద్వారా ఏలేరు జలాశయానికి చేరినపుడే ఈ పథకం లక్ష్యం నెరవేరినట్టు. కానీ ముఖ్యమంత్రి జాతికి ఈ పథకాన్ని అంకితం చేసి సరిగ్గా నాలుగు నెలలు కావస్తున్నా నేటికీ పథకం పంపులు బిగించే దశలోనే వుంది. అయితే ఈ రబీ సమయానికి మాత్రం ఏలేరుకు ఏదో విధంగా గోదావరి జల కళ ఆవరించింది. అవసరమైతే ఏలేరు నుంచి విశాఖకు కూడా పుష్కలంగా నీటిని అందించే భరోసా దక్కింది. ఈ నేపధ్యంలో గోదావరి జలాలు ఉత్తరాంధ్ర దిశగా ప్రవహించనున్నాయని చెప్పొచ్చు.
ఏదేమైనప్పటికీ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం చివరి దశకు చేరుకుంటోంది. ఈ పథకంలో నిర్ధేశిత పైపులైను నిర్మాణం పూర్తి కావచ్చింది. రెండు దశలుగా జరుగుతోన్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మరో నెల రోజుల్లో హెడ్ వర్క్సు పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ తీసుకున్నారు. జీవో నెంబర్ 100 ప్రకారం 2016 అక్టోబర్ 14న వెలువడిన ఉత్తర్వుల మేరకు రూ.1638 కోట్ల అంచనా వ్యయంతో సాంకేతిక అనుమతి లభించింది. మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. గోదావరి వరద రోజుల్లో 3500 క్యూసెక్కుల నీటిని ఎత్తి పోలవరం ఎడమ ప్రధాన కాలువ 1.6 కిలో మీటర్ల వద్ద పోసే విధంగా 10 వెర్టికల్ టర్బైన్ పంపులను ఒక్కోటి 10 క్యూమెక్స్ సామర్ధ్యంతో తోడి 5 వరుసల 10.10 కిలో మీటర్ల మేర సరఫరా చేసి కాలువలో వేస్తారు. స్టేజ్ 2లో 1400 క్యూసెక్కుల జలాలను పోలవరం ఎడమ ప్రధాన కాలువ 50వ కిలో మీటర్ల నుంచి ఒక్కొక్కటీ 5 క్యూమెక్‌ల సామర్ధ్యం కలిగిన 8 వెర్టికల్ టర్బైన్ పంపుల ద్వారా తోడి రెండు వరసల్లో ఉన్న 13.12 కిలో మీటర్ల మేర పైపులైన్ ద్వారా ఏలేరులోకి పోస్తారు.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2.15 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తారు. ఏలేరు రిజర్వాయర్, పిఠాపురం బ్రాంచి కెనాల్‌కు నీటి సరఫరా చేస్తారు. 67614 ఎకరాలు ఏలేరు ఆయకట్టు, పిబిసితో కలిపి 2.15 ఎకరాలకు అందించనున్నారు. ఈ పథకం ద్వారా రూ.200 కోట్ల ఆదా యం సాధించే విధంగా రూపకల్పన చేశారు. భూసేకరణకు సుమారు రూ.56 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక పంపుహౌస్‌ల నిర్మాణానికి సంబంధించి కాంక్రీటు పని పూర్తయింది. సబ్ స్టేషన్ కాంక్రీటు పని కొనసాగుతోంది. పంపు నెంబర్ 1, 2 మోటార్లు నిర్మాణం పూర్తయింది. ఏడు పంపుల నిర్మా ణం పూర్తయింది. స్టేజ్ 2 పంపుహౌస్‌కు సంబంధించి మెయింటెన్స్ బే శ్లాబ్ స్టీల్ ప్లేసింగ్ జరుగుతోంది. క్రేన్ నిర్మాణం, ట్రాష్ రాక్, మేనిఫోల్డ్ పూర్తయ్యాయి. మూడు పంపుల నిర్మాణం జరుగుతోంది. మూడు మోటార్ల బిగింపు పూర్తయింది. ఇక పైపులైన్ల నిర్మాణం విషయానికొస్తే స్టేజ్ 1లో ఒక వరస పైపులైన్ పూర్తయింది. మొత్తం ఐదు వరుసల పైపులైన్‌కు సంబంధించి నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంది. స్టేజ్ 2 పైపులైన్‌లో రెండు వరుసల పైపులైన్ 13.15 కిలో మీటర్ల మేర నిర్మాణం చేయాల్సి ఉంది.
పైపులైన్ల ఫ్యాబ్రికేషన్ పనులు పూర్తయ్యాయి. ఒక వరస పైపులైను పూర్తయింది. రెండో పైపులైను పునాధి 22024 మీటర్లు పూర్తయింది. 8909 మీటర్ల మేర పైపులైను పూర్తయ్యింది. మొత్తం మీద ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు స్విచ్ ఆన్ చేసిన ఈ పథకంలో ప్రస్తుతం రెండు మోటార్ల ద్వారా తోడిన 700 క్యూసెక్కుల గోదావరి జలాలు ఒక పైపులైన్ ద్వారా ఏలేరు జలాశయానికి ప్రత్యామ్నాయ విధానం ద్వారా పుష్కర కాల్వ ద్వారా చేరుతున్నాయి.