రాష్ట్రీయం

తెలంగాణకు సివిల్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల తరహాలో గ్రూప్-1, గ్రూప్-2కు ఒకే పరీక్ష నిర్వహించే విషయమై తెలంగాణ యోచిస్తోంది. దీనికి సంబంధించి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని టిఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. గ్రూప్-1, గ్రూప్-2 స్థానంలో తెలంగాణ సివిల్ సర్వీసు పరీక్షలు అని నామకరణం చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి పబ్లిక్ సర్వీసు కమిషన్ సూచించింది. ఒకే పరీక్షను నిర్వహించడం వల్ల మెరిట్‌ను బట్టి గ్రూప్-1, 2 పరీక్షల పరిధిలోని ఉద్యోగాలను ఆర్డర్ ప్రకారం అభ్యర్థులకు కేటాస్తారు. యూపీఎస్సీలో ఇండియన్ ఫారిన్ సర్వీసు, ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ, రైల్వే, ఇంకా అనే ఉద్యోగ సర్వీసులకు ఒకే పరీక్షను సివిల్ సర్వీసు పరీక్ష పేరుమీద నిర్వహిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్-1, 2 పరీక్ష విధానమే కొనసాగుతోంది. కాని గ్రూప్-1లో రాష్టస్థ్రాయి పోస్టులు ఉంటాయి. గ్రూప్-2లో జోనల్ క్యాడర్ పోస్టులుంటాయి. తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరిగింది. దీనివల్ల ఒక జోన్‌లో ఉన్న గ్రామాలు, మండలాలు, ప్రాంతాలు మరో జోన్‌లోకి వెళ్లాయి. పైగా ప్రభుత్వం తొలుత జోన్ల విధానాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించింది. తర్వాత దీనివల్ల న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని భావించి జోన్ల సంఖ్యను పెంచాలని
ప్రతిపాదించింది. ఈ విషయం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ప్రభుత్వం నిరుద్యోగుల ప్రయోజనం కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నా, కొంత మంది న్యాయపరంగా అనేక సవాళ్లను తీసుకువస్తున్నారని, దీని వెనక విపక్షాలు ఉన్నాయని అధికార పార్టీ అనేకసార్లు విమర్శించింది.
యూపీఎస్సీ తరహాలోనే ఇంజనీర్లు, వైద్యుల నియామకానికి ఒకే పరీక్షను నిర్వహించే ప్రతిపాదన కూడా ఉంది. గ్రూప్-3, 4 పోస్టులకు జాతీయ స్థాయిలో స్ట్ఫా సెలెక్షన్ కమిషన్ తరహాలో రాష్టస్థ్రాయిలో స్ట్ఫా సెలెక్షన్ పరీక్ష నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. తెలంగాణ సివిల్ సర్వీసు, స్ట్ఫా సెలెక్షన్ పరీక్షలపై విషయమై ఉన్నతస్థాయిలో ఒక సమావేశాన్ని నిర్వహించి నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఒక స్పష్టమైన విధానాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.