రాష్ట్రీయం

ప్రగతి రాయబారులు మీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ప్రపంచానికి తెలియజేసేందుకు తెలంగాణ ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) అభివృద్ధి రాయబారులుగా మారాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు 42 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు సీఎం ప్రగతి భవన్‌లో ఆదివారం రాత్రి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చైనాలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన తర్వాత వివిధ దేశాల్లో స్థిరపడిన చైనీయులే మొదట అక్కడ పెట్టుబడి పెట్టి ఆ దేశాభివృద్ధిలో కీలకంగా నిలిచారని కేసీఆర్ గుర్తు చేశారు.
అదే ఒరవడి ప్రదర్శించి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం కోరారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఎలా ఉండాలని కోరుకున్నామో ఇప్పుడు అదే విధంగా తెలంగాణ దూసుకుపోతోందని అన్నారు. 17.8 శాతం ఆదాయ వృద్ధి రేటుతో దేశంలోనే నెంబర్ వన్‌గా తెలంగాణ నిలిచిందని తెలిపారు. 2024 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఐదు లక్షల కోట్లు ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారని అన్నారు. మిషన్ భగీరథ, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం అద్భుతంగా కొనసాగుతోందని వివరించారు. అవినీతికి ఆస్కారం లేని, కేవలం 15 రోజుల్లోనే అనుమతులిచ్చే విధంగా తెలంగాణ పారిశ్రామిక విధానం అమల్లోకి తేవడం ద్వారా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆకట్టుకోగలుగుతున్నామని చెప్పారు. ఈ విషయాలన్నీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీరంతా తెలంగాణ వారిగా అందరికి తెలియజేసి మీ కర్తవ్యాన్ని నెరవేర్చాలని కోరుతున్నానని సీఎం ఎన్‌ఆర్‌ఐలకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ఆదాయం 70 శాతం వరకు తెలంగాణ నుంచి వస్తే ఖర్చు చేసేది మాత్రం తెలంగాణకు 10 శాతం నుంచి 15 శాతం మాత్రమేనని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్, ఆర్థికవేత్త హనుమంతరావు 1956 నుంచి లెక్కలు తీసి ఈ విషయాన్ని బయటపెట్టారని తెలిపారు. 1350 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అవకాశం ఉన్నా 200 టీఎంసీలు కూడా వాడుకునే పరిస్థితి లేదని ఆనాటి విషయాలను ఎన్‌ఆర్‌ఐలకు సీఎం వివరించారు. విద్యుత్ ఉత్పాదనలోనూ అద్భుత ప్రగతి సాధించామని తెలిపారు. రాష్ట్ర ప్రగతిని విదేశాల్లో ప్రతి ఒక్కరికి తెలియజేసి పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే విధంగా కృషి చేయాలని వారిని కోరారు. ఈ సమావేశంలో ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, ఎన్‌ఆర్‌ఐల కో ఆర్డినేటర్ మహేష్ బిగాల తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ప్రగతిభవన్‌లో ఆదివారం రాత్రి ఇచ్చిన విందుకు హాజరైన ఎన్‌ఆర్‌ఐలతో సీఎం కేసీఆర్