రాష్ట్రీయం

తెలుగు సాహిత్యం ఎంతో గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: తెలుగు సాహిత్యం ఎంతో గొప్పదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల మూడవ రోజు ఆదివారం ఉదయం ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలోని శ్రీవానమామలై వేదికపై నిర్వహించిన బృహత్ కవి సమ్మేళనం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎంతోమంది గొప్ప కవులున్నారని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన తెలుగు భాషకు సిఎం కెసిఆర్ పెద్ద పీట వేశారని అన్నారు. తెలంగాణ భాష, యాస, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రపంచ తెలుగు మహాసభలను ఇక్కడ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తెలుగు నేల, తెలుగు భాష, తెలుగు వంటలు ఎంతో ఆరోగ్యమైనవని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి టి.పద్మారావు మాట్లాడుతూ తెలుగు భాషకు గుర్తింపు తెచ్చేందుకు తమ ప్రభుత్వం 1 నుంచి 12 తరగతుల వరకు తెలుగు భోధనాంశాలను తప్పనిసరి చేసిందని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భాష, యాస భావితరాలకు అందేందుకు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో దోహదపడతాయని అన్నారు. శాసనమండలి సభ్యుడు కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ మనకు బ్రతుకు నేర్పిన తెలుగు భాషను మరువ వద్దని, తెలంగాణ యాస, నుడికారాన్ని కాపాడుకునేందుకు మరో ఉద్యమం రానుందని అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ కవిత్వం అంతిమ లక్ష్యం హృదయాన్ని చేరుకోవడమేనని అన్నారు. కవులకు సహనం అవసరమని, ఏర్పాట్లలో ఏదైనా చిన్న లోపాలు ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం పట్ల ఆయన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

చిత్రం..బృహత్ కవిసమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి