రాష్ట్రీయం

దేశం మనవైపే చూస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా కొనసాగుతుండటంతో దేశం యావత్తూ తెలంగాణవైపే చూస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఎల్‌బి స్టేడియంలో పాల్కురికి సోమనాథ ప్రాంగణంలో ‘వౌఖిక వాజ్ఞయం భాష’ అంశంపై జరిగిన సాహిత్య సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాల నుండి దాదాపు 500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి కూడా ప్రతినిధులు హాజరవుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మొట్టమొదటి సారి ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు మహాసభలతో తెలుగు భాషకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. నన్నయతో సహా అనేక మంది కవులు, రచయితలు తెలుగు భాషకు వనె్న తెచ్చారని ఢిల్లీకి చెందిన జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త సత్యవ్రత శాస్ర్తీ పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈరోజు సత్యవ్రత శాస్ర్తీని ఘనంగా సన్మానించారు. సన్మానంలో భాగంగా తుమ్మల తదితరులు ఆయనకు శాలువా, మొమెంటో, నగదును అందించారు. ఈ సందర్భంగా సత్యవ్రత శాస్ర్తీ మాట్లాడుతూ, దేశంలోని ఇతర భాషలకన్నా తెలుగులో ఉండే తీయదనం మదురమైందన్నారు. విశ్వవ్యాప్తంగా తెలుగు భాష మరింత వృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నేతృత్వంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలతో భాషాభివృద్ధికి మార్గం సుగమం చేసినట్టయిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న శ్రద్ద వల్ల తెలుగు భాషపై అందరిదృష్టి పడ్డదన్నారు. తెలుగు సాహిత్యం తొలుత వౌఖికంగా కొనసాగిందని, ఆ తర్వాత లిఖితపూర్వకంగా వెలుగులు చిమ్మిందని ఆచార్య కొలకలూరి ఇనాక్ పేర్కొన్నారు. పల్లె ప్రజల్లో తెలుగు సాహిత్యం వౌఖికంగానే అభివృద్ధి చెందిందని, బతుకమ్మ పాటలు ఇందుకు గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సామెతలు, జాతీయాల గురించి ఈ సందర్భంగా కసిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గోరటి వెంకన్న, వెలిచాల కొండలరావు, నలిమెల భాస్కర్ తదితరులు మాట్లాడారు.