రాష్ట్రీయం

రెండేళ్లకోసారి అంతర్జాల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రపంచ అంతర్జాల సదస్సును రెండేళ్లకోసారి నిర్వహించేందుకు ఐటీ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. డిజిటల్ మాధ్యమాలలో తెలుగు వినియోగాన్ని పెంపొందించేందుకు వ్యక్తిగతంగా, సంస్థాగతంగా జరుగుతున్న ప్రయత్నాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా కృషి జరగాలని, అందుకు తమ సహకారం ఉంటుందని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఆదివారం ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం నిర్వహించిన చర్చాగోష్టిలో పలువురు వక్తలు ప్రసంగించారు.
ఐకాన్ (ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్) కొత్తగా వంద కోట్ల మందికి అంతర్జాలాన్ని చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఇందుకోసం అంతర్జాలంలో స్థానికీకరణ ప్రయత్నాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటాయని వక్తలు అభిప్రాయపడ్డారు. వెబ్‌సైట్లను పూర్తిగా యూనికోడ్ ఉపయోగించి రూపొందించామని జయేష్ రంజన్ అన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ మాధ్యమాలతో తెలుగును వాడటానికి ఉపయోగపడే పనిముట్లను, అప్లికేషన్లను, ఖతులు, ఇతరత్రా సాధనాలను ఒక్క చోట చేర్చిన వెబ్ పేజ్‌లను ఆయన డిజిటల్ మీడియా సంచాలకులతో కలసి ఆవిష్కరించారు. డిజిటల్ తెలుగు చర్చా గోష్టి స్థూలంగా నాలుగు అంశాలపై జరిగింది. డిజిటల్ తెలుగు-పరిణామక్రమం, నేటి వరకు జరిగిన కృషి, బ్లాగులు, పత్రికలూ, వికిపీడియా, ఈ-కామర్స్ వంటి ఆన్‌లైన్ వేదికలపై తెలుగు వాడకం, పదాలను శబ్దంగా మార్చే ప్రక్రియ (టెక్స్ట్ నుండి స్పీచ్), స్థానీకరణ (లొకేషన్ ఆఫ్ కాంటెంట్) డిజిటల్ తెలుగు వాడుకను పెంపొందించే క్రమంలో ప్రభుత్వం, వ్యక్తులు, ఇతర సంస్థలు ఇకపై చేయవలసిన కృషి తదితర అంశాలు. మహాసభల్లో ఐటీ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిన అంశాలిలావున్నాయి. ప్రపంచ అంతర్జాతీయ సదస్సు ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించేందుకు అంగీకరిస్తూ, డిజిటల్ తెలుగు రంగంలో ఉపకరణాలను అభివృద్ధి చేస్తున్న ప్రోగ్రామర్లకు ఒక పోటీని పెట్టడం ద్వారా వాటిని గర్తించడం, అదే సమయంలో తెలుగు వాడుకను పెంపొందించడం, సరళతరం చేయడం. కొత్త తెలుగు ఖతులను, ఉపకరణాలను, అప్లికేషన్ల అభివృద్ధి, ఆ రంగంలో పనిచేస్తున్న వారికి అవసరమైన సహాయం. ప్రభుత్వ ఉద్యోగులకు, రచయితలకు, విలేకరులకు, విద్యార్థులకు డిజిటల్ మాధ్యమాలలో తెలగు వాడకంపై అవగాహనా సదస్సులను నిర్వహించడం. ప్రభుత్వ వెబ్‌సైట్లలో తెలుగు వాడకాన్ని ప్రోత్సహించడం, దశల వారీగా తప్పనిసరి చేయడం. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ వంటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థలతో, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలతో తెలుగును డిజిటల్ మాధ్యమాలలో విస్తృతంగా వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నించడం. డిజిటల్ మీడియా విభాగం సంచాలకులు దిలీప్ కొణతం, సహాయ సంచాలకులు మాధవ్ ముడుంబై, కూచిబొట్ల ఆనంద్, ఉమామహేశ్వర రావు, సురేష్ కూచిబొట్ల, వీవెన్‌లతోపాటు డిజిటల్ మాధ్యమాలలో తెలుగు వాడుకపై వివిధ రంగాలలో కృషి చేస్తున్న సుమారు 60 మంది ప్రముఖులు ఈ చర్చాగోష్టిలో తమ అభిప్రాయాలు వెల్లడించారు.

చిత్రం..ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఆదివారం శతావధాని రామశర్మను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్