రాష్ట్రీయం

నేలకొరిగిన పిల్లలమర్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 17: మహబూబ్‌నగర్ జిల్లాకే ఖ్యాతిని తీసుకువచ్చిన చారిత్రాత్మక పిల్లలమర్రి చెట్టు నేలకొరిగింది. దాదాపు ఏడు వందల ఏళ్లకు పైగా చరిత్ర గల ఈ మహావృక్షానికి కొంతకాలంగా ఏదో ఓ రకమైన తెగులు తగిలి క్షీణించిపోయి నేల కూలింది. మర్రిచెట్టు నేలకూలిందని ఆదివారం ఉదయం పిల్లలమర్రికి వచ్చిన పర్యాటకులు గమనించారు. శనివారం రాత్రి చెట్టు కూలింది. చెట్టు నేలకూలడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. తెగులు తగలడంతో పర్యాటక శాఖ అధికారులు కొంతకాలంగా తెగుళ్లకు విరుగుడుగా చెట్టు ఊడలకు, కొమ్మలకు మందులు చల్లుతుండేవారు. మర్రిచెట్టులోని ప్రధాన ఊడలు రెండు నేలకొరిగాయి. ఏడువందల ఏళ్ల చరిత్ర గల ఈ చెట్టులో ప్రస్తుతం నేలకొరిగిన ఈ రెండు ఊడలే ప్రధానంగా పర్యాటకులకు ఆక్షర్శణీయంగా ఉండేవి. ఈ ఊడలు నేలకొరగడంతో పిల్లలమర్రి చెట్టు అందవిహీనంగా మారిందని పర్యాటకులు చర్చించుకున్నారు.

చిత్రం..మహబూబ్‌నగర్‌లో నేలకొరిగిన పిల్లలమర్రి మహావృక్షం