రాష్ట్రీయం

సమకాలీన రచనలకే ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: సమకాలీన అంశాలు, సమాజంలోని పాత్రలతో కూడిన నవలలకు పాఠకాదరణ ఉంటుందని ప్రముఖ నవలా రచయిత గటిక విజయ్‌కుమార్ అన్నారు. తెలుగు భాషలోని అన్ని ప్రక్రియల కంటే కథ, నవలా ప్రక్రియలు భావితరాలకు సాహిత్యాభిలాషను కలిగించేందుకు దోహదం చేస్తాయన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఆదివారం తెలుగు యూనివర్సిటీలో నవలా సాహిత్తంపై జరిగిన చర్చాగోష్టిలో ‘తెలంగాణ ఉద్యమ నవల’ అనే అంశంపై విజయ్‌కుమార్ ప్రసంగించారు. తెలంగాణలో ఒకటో తరగతి నుంచి పనె్నండో తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలనే విధాన నిర్ణయం తీసుకున్నందున పాఠ్యాంశాల్లో కథ, నవలా రచన ఉండాలని ఆయన సూచించారు. పరీక్షల్లో కూడా కథ, నవల రచనకు మార్కులు ఉండాలన్నారు. సామాజిక పరిణామాలను ప్రజల కోణం నుంచి, సమాజంలోని పాత్రలతోనే రికార్డు చేసి సాహిత్య ప్రక్రియ నవల అన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి అద్భుత సాహిత్య సృజన జరిగిందన్నారు. వట్టికోట ఆళ్వార్ స్వామి, అంశయ్య, నవీన్ లాంటి వారి గొప్ప నవలల వెనుక తెలంగాణ ఉద్యమ నేపథ్యమే ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ నవలపై ప్రసంగించిన విజయ్‌కుమార్‌ను మంత్రి జోగు రామన్న, ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్ తదితరులు ఘనంగా సన్మానించారు. రూ. 5వేల నగదు పారితోషికంతోపాటు జ్ఞాపికను బహూకరించారు.