రాష్ట్రీయం

జంట కవులంటే వారే గుర్తుకొస్తారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: జంటకవులంటే అందరికీ మొదట గుర్తుకువచ్చేది తిరుపతి వేంకట కవులని, అలనాడు గద్వాల సంస్థానంలో కవులకు ప్రాధాన్యత ఇచ్చేవారని పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగామూడవ రోజున రవీంద్ర భారతిలో డాక్టర్ యశోదారెడ్డి ప్రాంగణంలో బండారు అచ్చమాంబ వేదికలో జరిగిన జంటకవుల అష్టావధానంలో ఆయన మాట్లాడారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన కృషిని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ, ముత్యంపేట గౌరి శంకర్ శర్మ అవధానం చేశారు. అనుసంధాన కర్తగా ఘట్టి కృష్ణమూర్తి వ్యవహరించారు. కార్యక్రమం అనంతరం అష్టావధానంలో పాల్గొన్న కవులను ఘనంగా సన్మానించారు. యూత్ అడ్వాన్స్‌మెంట్ కార్యదర్శి బి వెంకటేశం, సాంస్కృతిక శాఖ సంచాలకుల మామడి హరికృష్ణ పాల్గొన్నారు. అనంతరం అక్షర గణితావధానం అవధాని పుల్లూరి ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించచారు. అష్టావధానాల్లో విభాన్న ప్రక్రియ అయిన అక్షర గణితావధానం ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.