రాష్ట్రీయం

పండగ ముగిసేవేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: హైదరాబాద్‌లో జరుగుతున్న ఐదురోజుల తెలుగు పండగ మంగళవారం ముగుస్తోంది. కనీవిని ఎరగని రీతిలో ఈ పండగ జరగడంతో అందరిలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నెల 15 న ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారం సాయంత్రం ముగుస్తున్నాయి. ముగింపు సమావేశంలో భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొనడం హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగే ముగింపు సమావేశంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ తదితరులు పాల్గొంటున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకోసం ఆరువేదికలను ఏర్పాటు చేశారు. ఎల్‌బి స్టేడియం (పాల్కురికి సోమన ప్రాంగణం, బమ్మెర పోతన వేదిక) ప్రధాన వేదికగా కొనసాగుతుండగా, రవీంద్రభారతి, రవీంద్రభారతిలోని మినీహాలు, తెలుగు విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియం, నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, బొగ్గుల కుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లలో వివిధ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అన్ని వేదికల్లో కూడా జనప్రభంజనం కనిపిస్తోంది. ‘ఏ వేదిక చూసినా జనమే జనం’ అన్నట్టు ఉంది. ఎల్‌బి స్టేడియంలో జరుగుతున్న సాహిత్య సమావేశాలు, సాంస్కృతిక సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రతినిధులు, ప్రజలు హాజరవుతున్నారు. సాయంకాలం చలి మొదలవుతున్నప్పటికీ, చలిని సైతం లెక్కచేయకుండా ఈ కార్యక్రమాలను ప్రజలు చూస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత విజయవంతంగా సాగుతున్నాయి. వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులతో పాటు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు, సాధారణ ప్రజల కరతాళ ధ్వనులతో ఎల్‌బి స్టేడియం మార్మోగిపోతోంది. సారస్వత పరిషత్‌లో జరుగుతున్న శతావధానం అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న కవుల సమ్మేళనాలు, పుస్తకాలపై చర్చలు ఆసక్తికరంగా ఉన్నాయి. రవీంద్రభారతిలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మొత్తంమీద ప్రపంచ తెలుగు మహాసభలు అందరి ఊహలకన్నా విజయవంతంగా సాగుతున్నాయి. మంగళవారం జరిగే వివిధ సభలకు భారీ ఎత్తున ప్రజలు హాజరవుతారని నిర్వహకులు అంచనా వేస్తున్నారు.