రాష్ట్రీయం

రచయితల కంటే పాత్రికేయులపైనే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: భాష సుసంపన్నం కావాలంటే పాత్రికేయులు రచయితల కన్నా ఎక్కువ కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అన్నారు. తెలుగు మహాసభలను పురస్కరించుకుని రవీంద్రభారతి గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ ప్రాంగణం డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదికపై పత్రికలు- ప్రసార మాధ్యమాల్లో తెలుగు అంశంపై జరిగిన గోష్టిలో సీనియర్ పాత్రికేయులు, ఎడిటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె కేశవరావు మాట్లాడుతూ భాషా ప్రామాణీకరణకు పాత్రికేయులు కృషి చేయాలని సూచించారు. మీడియా అకాడమి అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచారి, పొత్తూరి వెంకటేశ్వరరావులను ఘనంగా సత్కరించారు. తొలుత అల్లం నారాయణ మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. తెలుగు భాషను ఉన్నతంగా నిలిపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని చెప్పారు. సామాజిక మాధ్యల్లో తెలుగు వినియోగం ఇంకా పెరగాలని అన్నారు. తెలుగు భాషా పరిరక్షణకు తెలంగాణ మీడియా అకాడమి కృషి చేస్తోందని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు వివిధ రకాల మాండలికాలు మాట్లాడతారని మధ్యాంద్ర ప్రాంతాల్లో మాట్లాడే భాష మాత్రం ఆధిపత్యం వహిస్తోందని ఆవేదనగా చెప్పారు. మనం ప్రస్తుతం మాట్లాడుతున్న భాష ఫ్యూడల్ భాష అని, అట్టడుగు వర్గాల భాష ఇంకా ప్రచారం కాలేదని, దీనిపైన దృష్టి సారించాలని అన్నారు. సిపిఆర్‌ఓ జ్వాలా నరసింహరావు మాట్లాడుతూ తెలుగు గమనానికి డోకా లేదన్నారు. భాషలో కాలానుగుణంగా వచ్చే మార్పులను స్వాగతించాలన్నారు. వాడుక భాషకు, రాత భాషకు తేడా ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.