రాష్ట్రీయం

కృష్ణదేవరాయలను మరిచారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలుగు ప్రాంతంలో లేకపోయినప్పటికీ, ఈ భాషకు విశేషంగా శ్రమించిన కొంత మందిని తెలుగు మహాసభల సమయంలో స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కన్నడ ప్రాంతాన్ని పాలించినప్పటికీ, తెలుగు భాషకు శ్రీకృష్ణదేవ రాయలు చేసిన సేవ అజరామరం. అలాంటి మహనీయుడికి మహాసభల్లో సముచిత ప్రాధాన్యం లేదన్న విమర్శలున్నాయి. ఆముక్తమాల్యద కావ్య రచయితగా, పండితుడిగా, సాహిత్యాభిలాష ఉన్న పాలకుడిగా బహుముఖ ప్రజ్ఞావంతుడైన రాయల ఘన కీర్తిని నోరారా చాటలేని సభలెందుకని కొంత మంది బాహాటంకంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, ఆయన కొలువులోని అష్టదిగ్గజాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కొక్కరూ ఒక్కో ఆణి ముత్యమే. రాయలసీమ ప్రాంతానికి చెందిన అల్లసాని పెద్దన, ధూర్జటి, నంది తిమ్మన, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరనతోపాటు తెనాలి రామకృష్ణుడు, రామరాజ భూషణుడుతో కూడిన ‘్భవన విజయం’ తెలుగు సాహితీ కేంద్రంగా విరాజిల్లింది. రాయలు రాజధాని నేటి కర్నాటకలో ఉంది కాబట్టి ఆయనను విస్మరించారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రాంతానికి చెందిన వారైనా, తెలుగు భాషకు ఏదో ఒక రూపంలో సేవలు అందించిన వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తంజావూరుకు చెందిన సముఖం వెంకట కృష్ణప్ప నాయుడు జెమినీ భారతం రాసి, తెలుగుకు తన వంతు సేవ చేశాడు. ఆయన పేరు తెలుగు మహాసభల్లో తలచుకున్న వారే కనిపించలేదు. తెలుగు వ్యాకరణానికి దిశానిర్దేశనం చేసిన పరవస్తు చిన్నయసూరి నేటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న పెరంబదూరుకు చెందిన వాడు. ఆయన రాసిన ‘బాల వ్యాకరణం’ తెలుగును చందోబద్ధం చేసింది. కానీ, చిన్నయ సూరి గురించిన ప్రస్తావన, ఆయన గొప్పతనాన్ని తెలియచేసే కార్యక్రమాలు మహాసభల్లో లేవనే చెప్పాలి.