రాష్ట్రీయం

ముదిగొండకు సతీ వియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: ప్రముఖ సంస్కృత పండితురాలు డాక్టర్ ముదిగొండ ఉమాదేవి (71) సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. డాక్టర్ ఉమాదేవి ప్రముఖ రచయిత, చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ సతీమణి. ఎన్నో పుస్తకాలు, ఉపనిషత్‌లు, సంస్కృత కావ్యాలను ఉమాదేవి రాశారు. పాల్కురికి సోమనాధుడు - సంస్కృత భాషకు చేసిన సేవలు పేరిట ఆమె రాసిన సంస్కృత గ్రంథం ప్రఖ్యాతి పొందింది. శ్రీ విద్యారత్న లాలిత్యం, శ్రీ విద్యారత్నాకరం పేరిట ఆమె గ్రంథాలు రాశారు. వీటితో పాటు అనేక అంశాలపైన ప్రధానంగా పాల్కురికి సోమనాధుడి రచనలపై ఎన్నో విశే్లషణాత్మక వ్యాసాలు రాశారు. కొద్ది రోజులుగా స్వల్ప అస్వస్థతకు గురైన ఉమాదేవి గుండెపోటుకు గురై మరణించారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు పద్మ సుష్మ, శ్రీలేఖ, ఒక కుమారుడు ఇందుశేఖర్ ఉన్నారు. 1984లో పాల్కురికి సోమనాధుడిపై ఆమె తన పరిశోధనా గ్రంథాన్ని ఉస్మానియా యూనివర్శిటీలో సమర్పించారు. ఆ గ్రంథానికి అనేక మంది ప్రశంసలు అందాయి. ఆనాటి ఉప రాష్టప్రతి బి డి జట్టి వంటి వారు వ్యక్తిగతంగా ప్రశంసించారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలోని సోమనాథ కళాపీఠం 2014లో ఉమాదేవికి సోమనాధ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేసింది.

చిత్రం..ముదిగొండ సతీమణి ఉమాదేవి