రాష్ట్రీయం

తెలుగు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ గడ్డమీద చదువుకోవాలంటే తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందులో భాగంగానే ఒకటి నుంచి ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా అమలు చేయబోతున్నమన్నారు. తెలుగు భాషాభివృద్ధికి సభలు, సంబరాలు నిర్వహించి వదిలేయబోమని నిబద్ధతను చాటుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి ప్రతీ ఏటా డిసెంబర్ మాసంలో రెండు రోజుల పాటు తెలంగాణ తెలుగు మహాసభలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపును పురస్కరించుకుని ఎల్‌బి స్టేడియంలో మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై వందల, వేల సూచనలు వచ్చాయన్నారు. ఇప్పటికిప్పుడు ఆదరాబాదరాగా నిర్ణయాలను ప్రకటించకుండా వచ్చే నెల జనవరి మొదటి వారంలో భాషా సాహితీవేత్తలతో విస్తృత సమావేశం ఏర్పాటు చేసి అందులో నిర్ణయాలను ప్రకటిస్తామన్నారు. అలాగే తెలుగు భాషా పండితుల సమస్యలను పరిష్కారానికి కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడంతో ఇబ్బందులు తలెత్తకుండా కసరత్తు చేసి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. రిటైర్డు అయిన భాషా పండితుల పెన్షన్‌లో కోతలు విధిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇక నుంచి ఈ కోతలను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగు మృత భాష కాకుండా బతికించుకోవాలని ఉప రాష్టప్రతి పిలుపునిచ్చారని, తెలుగును బతికించుకోవాలనే మాటలు విన్నప్పుడు బాధేసిందన్నారు. తెలుగు నేల మీదే మన భాషను బతికించకోవాల్సిన పరిస్థితి రాకుండా తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. 1974లో ఇదే స్టేడియంలో డిగ్రీ విద్యార్థిగా తాను ఓ మూలన కూర్చుని ప్రపంచ తెలుగు మహాసభలను తిలకించానని ముఖ్యమంత్రి గుర్తు చేసారు. తెలంగాణ రాష్ట్రంలో సగౌరవంగా తెలుగు సాహితీ వైభవాన్ని ప్రపంచానికి చాటగలిగామని, తెలంగాణ ప్రభుత్వానికి ఈ ప్రాంత భాష పట్ల ఉన్న అభిమానం వెల్లడైందన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం కావడంతో ఆశించిన లక్ష్యం నెరవేరిందని సంతోషంగా ఉందన్నారు. ఉప రాష్టప్రతి చేతుల మీదుగా గురు పూజతో ప్రారంభించి సంస్కారవంతంగా మహాసభలను ప్రారంభించుకోగా ముగింపు సమావేశానికి రాష్టప్రతిని హాజరుకావడం పట్ల తెలంగాణ ప్రజల తరఫునా, తెలంగాణ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తెలుగు సాహితీవేత్తలనే కాకుండా దేశంలోని వివిధ భాషాల్లో జ్ఞానపీఠ అవార్డు గ్రహితలను సత్కరించి భాష పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నామన్నారు.
సీఎం కేసీఆర్ నవ్వుల పద్యం
కేసీఆర్ పద్యంతో మొదలైన ప్రపంచ తెలుగు మహాసభలు ఆయన పద్య ధారణతోనే ముగిశాయ.
‘నవ్వవు జంతువుల్
నరుడు నవ్వును
నవ్వులు చిత్తవృతికిన్ దివ్వెలు
కొన్ని నవ్వులెటు తేలవు
కొన్ని నవ్వులు విషప్రయుక్తముల్
పువ్వుల వోలే ప్రేమరసమున్ విరజిమ్ము
విశుద్ధమైన లే నవ్వులు సర్వదు:ఖ దమనంబులు
వ్యాధులకున్ మహౌదుల్’
అంటూ నవ్వులపై పద్యాన్ని వినిపించి ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

చిత్రం..ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు రోజున ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన