రాష్ట్రీయం

తెలుగుకు విశ్వ వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టు పంచె కట్టిన అచ్చ తెనుగు.. ఐదు రోజులపాటు పండుగ చేసుకుంది. అ ఆలను విస్మరించవద్దంటూ ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడి హితోక్తితో మొదలైన భాషా పండుగ.. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తెలుగు నుడికారంతో నిండుతనం సంతరించుకుంది. ఏ గడ్డపై అడుగుపెట్టినా తెలుగు మాట్లాడటం కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లంతా తెలుగు గడ్డపై తల్లి భాషను కీర్తిస్తూ ముచ్చటించుకోవడం అద్భుతం అనిపించింది. ముగింపు సభలకు ముఖ్యఅతిథిగా హాజరైన రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి తెలంగాణ విశ్వవెలుగు సంతరించుకుందని కొనియాడారు. ఎల్బీ స్టేడియంలో ప్రధాన వేదికనుంచి ఉపన్యసించిన రామ్‌నాథ్.. తెలుగు జాతి ఖండాంతరాలకు విస్తరిస్తోందని శ్లాఘించారు. భారత్‌లో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో తెలుగు రెండోస్థానంలో ఉందని, తెలుగువాడు అడుగుపెట్టని రంగమంటూ భూమండలంమీదే లేదన్నారు. తెలుగు భాష, సంస్కృతికి పట్టుబట్టకట్టి ఐదురోజుల పండుగ చేసిన తెలంగాణ ఘనకీర్తిని సంతరించుకుందని అన్నారు. 2008లో తెలుగుకు ‘క్లాసికల్ లాంగ్వేజ్’ గుర్తింపు రావడం వెనుక ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కృషి ఉందని గుర్తు చేస్తూ.. సంస్కృతం, అరబిక్, ఉర్దూ, ఇంగ్లీషు భాషల పదాలను తనలో ఇముడ్చుకున్న గొప్ప భాష తెలుగేనన్నారు. ఈ సభలు భాషాభివృద్ధికి కొత్త ఉత్సాహం తెచ్చాయంటూ భాషా ప్రముఖులను పేరుపేరునా కోవింద్ గుర్తు చేశారు. కంటి నిండా వెలుగై, కడుపునిండా తెలుగైన మహాసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పద్య పఠనం.. ప్రపంచ మహాసభలకే
సంపూర్ణత్వం తెచ్చింది.

*
జనమనముల భావములను
మానితముగ వెలికితెచ్చు మాధ్యము తెలుగై
వీనులకు విందుజేయుచు
కనులకు పండవగమారి కాంతులు జిమ్మెన్
*
చిత్రాలు..ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమానికి హాజరైన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు. వేదికపై గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు. *పెద్దఎత్తున హాజరైన తెలుగు భాషాభిమానులు