రాష్ట్రీయం

తక్కువేమి మనకూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణలో తెలుగుభాష పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలోని డాక్టర్ యశోధారెడ్డి ప్రాంగణం బండారు అచ్చమాంబ వేదికపై జరిగిన ప్రవాస తెలుగు వారి భాష సాంస్కృతిక విద్యా విషయాల గోష్టికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి యుఎస్ నుండి వచ్చిన జాగృతి అధ్యక్షుడు నారాయణస్వామి వెంకటయోగి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రపంచ మహాసభల్లో సాహిత్యానికి పెద్ద పీట వేసినట్టు చెప్పారు. తెలుగుభాష ప్రాచీనతను వివరించే ‘ఏవీ’ని ఆమె ప్రదర్శించారు. కాకతీయుల కాలంలో గొప్పకవి పాల్కురికి సోమన అని కొనియాడారు. సోమన తన జీవన గమనంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని తెలుగు రచనలకు ప్రాణం పోశారన్నారు. తెలుగులో రంగనాథ రామాయణాన్ని రాసిన గోన బుద్దారెడ్డి చరిత్రలో నిలిచిపోయారన్నారు. తెలుగు భాషపట్ల ప్రవాస తెలుగు వారికి మక్కువ ఎక్కువన్నారు. భాషాభిమానంతో 42 దేశాల నుండి తెలుగు ఎన్‌ఆర్‌ఐలు తరలి వచ్చారని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్యం సింహావలోకనం చేసుకుంటోందన్నారు. 42 దేశాల నుండి వచ్చిన వారు ఒకొక్కరి గురించి తెలుసుకుంటుంటే వారి పాత్ర, తెలుగు అభివృద్ధికి చేస్తున్న కృషి జన్మభూమికి దూరంగా ఉన్న వారు తమ పిల్లలకు పట్టుపట్టి కూచిపూడి, భరతనాట్యం, పద్యాలు నేర్పించడం తెలుగు చదవాలని చెప్పి శ్రద్ధ వహిస్తున్నారని, తెలుగు ప్రాధాన్యతను గుర్తించడం వల్లనే ప్రభుత్వం ఒకటో తరగతి నుండి 12వ తరగతి వరకూ తెలుగును తప్పనిసరి చేసిందని అన్నారు. దానికి సర్వత్రా అందరూ ఆమోదం తెలిపి
ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని అన్నారు. తెలంగాణ తేజోమూర్తుల చిత్రాలు ఎంతో శ్రమకోర్చి దేశంలో వేర్వేరు ప్రాంతాల్లోని లైబ్రరీల నుండి తెప్పించారని, వారందరినీ హైదరాబాద్ నగరం అంతా నింపుకున్నామని, ఈ సభల్లో పాల్గొనాలని అంతా రావడం ఎంతో హర్షణీయమని అన్నారు. తెలంగాణ సాహిత్య సింహం ఒక్కసారి జూలు విదిల్చుకుందని, సింహం మూడు అడుగులు ముందుకు నడిచి, ఠీవిగా ఏం జరుగుతుందో ఒక్కసారి చూసుకుంటుందని, తెలంగాణ సాహిత్య సింహం మేల్కొన్న సందర్భంలో సింహావలోకనం చేసుకోవాలని పేర్కొన్నారు. మలేషియాలో తెలుగు విద్యాపీఠం ఏర్పాటుకు 200 దేశాలనుండి ప్రతినిథులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. భాషా పరిరిక్షణకు ప్రపంచ దేశాల్లో కృషి జరగడం తెలుగు వారు గర్వపడదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో విదేశీ ప్రముఖులు చిట్టెంరాజు వంగూరు, డాక్టర్ గౌరీశంకర్, మహేశ్ బిగాల, న్యూజెర్సీ మాజీ ఉప సభాపతి ఉపేంద్రచివుకుల, లండన్ మాజీ మేయర్ సలేహ జఫర్, రఘురెడ్డి , డేనియల్ నజాబ్, సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిబొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విదేశీ తెలుగు ప్రతినిధులను ఎంపి కవిత సత్కరించారు.
దశాబ్దపు అద్భుతం: తనికెళ్ల
భాషాభిమానులతో తెలుగు మహాసభలు కిక్కిరిసి పోతున్నాయని సినీనటుడు తనికెళ్లభరణి అన్నారు. మహాసభలు ఈ దశాబ్దపు అద్భుతమని తనికెళ్ల అన్నారు. తరతరాలుగా దీని ప్రభావం, భాష పట్ల మక్కువ పెరిగిందని అన్నారు. జూలు విదుల్చుకుని ఒక్కసారి సింహం దూసుకువచ్చినట్టుందని, సభలకు వెళ్లకపోతే ఏదో లోపం ఉన్న ఫీలింగ్ అందరిలో కలుగుతోందని తనికెళ్ల చెప్పారు. సభలు కిక్కిరిసి పోతున్నాయని, అవధానం ఎంత సేపుజరుగుతుందో, దాని నుండి బయటకు రావడానికి అంత సమయం పడుతోందని ఈ మహాసంకల్పం చేసిన మహానుభావుడు కెసిఆర్‌కు పాదాభివందనం చేసుకుంటున్నానని అన్నారు. సభలు ప్రారంభం రోజున తన గురువుకు పాదాభివందనం చేయడం ద్వారా గొప్ప సంస్కారాన్ని పున:ప్రారంభించారని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరిలో మరోసారి పులకింత మొదలైందని పేర్కొన్నారు.

చిత్రం..ప్రవాస తెలుగువారి భాష సాంస్కృతిక విద్యా విషయాల గోష్టిలో మాట్లాడుతున్న ఎంపీ కవిత